Mohan babu: శుభవార్త షేర్ చేసుకున్న మోహ‌న్ బాబు.. తిరుప‌తిలో ఎంబీయూ యూనివ‌ర్సిటీ

Mohan babu: ప‌ద్మ‌శ్రీ మోహ‌న్ బాబు మూడు ద‌శాబ్ధాల‌కు పైగా సినిమా రంగంలో ఉన్నారు. కెరీర్‌లో ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌లు చేశారు. ఒక‌వైపు సినిమాలు చేస్తుండ‌డ‌మే కాక విద్యా వ్యాపారంలోను రాణిస్తున్నాడు. క్రమశిక్షణ, పాఠ్యాంశాలకు ప్రసిద్ధి చెందిన శ్రీ విద్యా నికేతన్‌ను ప్రారంభించాడు.ఇప్పుడు మోహన్ బాబు ఓ అడుగు ముందుకేసి తిరుపతిలో ఎంబీయూ యూనివర్సిటీ పేరుతో యూనివర్సిటీని ప్రారంభించారు.

mohan babu new education unversity mbu2
mohan babu new education unversity mbu2

ఈ వార్తను ఆయనే స్వయంగా వెల్లడిస్తూ “శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయని, ఈ సందర్భంగా తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీని అందిస్తున్నాను” అని అన్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రకటన మరియు మంచు కుటుంబం ఏర్పాటు చేసిన ఈ కొత్త విశ్వవిద్యాలయం నుండి చాలా మంది విద్యార్థులు తప్పకుండా ప్రయోజనం పొందుతారు అని మోహ‌న్ బాబు త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

నిన్న మంచు విష్ణు త‌న ట్విట్ట‌ర్‌లో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. దేవుడి దయ వల్ల త్వరలో మోహన్ బాబు గారు గొప్ప వార్తను అనౌన్స్ చేయబోతున్నారు అంటూ విష్ణు ట్వీట్ చేశారు. మా అధ్యక్షుడి నుంచి కచ్ఛితంగా మా అసోసియేషన్ భవంతి నిర్మాణంపైనే అప్ డేట్ ఉంటుందని అందరూ భావించారు. కాని తాను యూనివ‌ర్సిటీ స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

mohan babu new education unversity mbu1
mohan babu new education unversity mbu1

ఇదిలా ఉంటే `మా` అధ్యక్షుడిగా తన కొడుకు విజయంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ద‌గ్గ‌రుండి త‌న త‌న‌యుడిని మా అధ్య‌క్షుడిగా చేశాడు. ఇక ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న వివాదాల‌పై గ‌ళ‌మెత్తారు మోహ‌న్ బాబు. ఆయ‌న సినిమా ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా ఉంటారేమోన‌నే అనుమానాలు కూడా అంద‌రిలో క‌లిగాయి. ప్ర‌స్తుతానికి అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.