MOHAN BABU: వ్యాక్సిన్ తీసుకున్న మోహ‌న్ బాబు.. క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని విజ్ఞ‌ప్తి

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ మ‌న‌దేశంలో విల‌య‌తాండ‌వం సృష్టిస్తుంది. గ‌త ఏడాది క‌న్నా ఈ ఏడాది కరోనా విజృంభ‌ణ రేటు ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలి అంటే మాస్క్ ధ‌రించ‌డం, ఎప్ప‌టిక‌ప్పుడు చేతులు శుభ్రంగా క‌డుక్కోవ‌డం, భౌతిక దూరం వంటివి పాటించ‌డం వంటివి చేస్తూనే టీకా తీసుకోవాలి అని ప్ర‌భుత్వాలు విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వ‌స్తున్నారు.

గ‌త నెల‌లో తిరుప‌తిలో ఉన్న‌ప్పుడు క‌రోనా తొలి వ్యాక్సిన్ తీసుకున్న మోహ‌న్ బాబు ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. తాజాగా సెకండ్ డోస్ తీసుకున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ వ్యాక్సిన్ తీసుకుంటున్న‌ప్పుడు క్లిక్‌మ‌నిపించిన ఫొటోలు షేర్ చేశాడు. అంతేకాక ప్ర‌తి ఒక్క‌రు మాస్క్‌లు ధ‌రించ‌డంతో పాటు ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. మాస్క్ మ‌న‌కు శ్రీరామ ర‌క్ష అని అంద‌రు చెబుతున్న‌ప్ప‌టికీ, కొంద‌రు మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం మోహ‌న్ బాబు .. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో స‌న్నాఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నారు.

 

Advertisement