Siri Vennela : సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళులు అర్పించ‌ని మంచు ఫ్యామిలీ.. మోహ‌న్ బాబు కార‌ణ‌మ‌ట‌..!

Siri Vennela : టాలీవుడ్ లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణాన్ని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న ఈయన.. వారం రోజుల్లోనే అనారోగ్యం కారణంగా మరణించడానికి ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఈయన మరణం గురించి మోహన్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Mohan Babu family not came for Siri Vennela final tribute
Mohan Babu family not came for Siri Vennela final tribute

సిరివెన్నెల నారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. సిరివెన్నెల అంత్యక్రియలకు టాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సిరివెన్నెలను కడసారి చూసి సంతాపం తెలిపారు.

Mohan Babu family not came for Siri Vennela final tribute
Mohan Babu family not came for Siri Vennela final tribute

అయితే ఆరోజు ఎక్కడా మోహన్ బాబు ఫ్యామిలీ కనిపించలేదు.. దీంతో మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదు అని అభిమానుల్లో అనుమానం వ్యక్తం అయ్యింది. ఇక తాజాగా సిరివెన్నెల భౌతికకాయం చూడడానికి ఎందుకు రాలేదో మోహన్ బాబు తెలిపారు. తాజాగా ‘రుద్రంకోట’ సినిమా కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు సిరివెన్నెల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ” సిరివెన్నెల మరణంతో ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది..

మా ఇంట్లో నా తమ్ముడు మృతిచెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.. ఆ సమయంలో ఇంట్లో ఎవరు బయటికి వెల్ళకూడదు.. అందుకే సిరివెన్నెల భౌతికకాయం చూడడానికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పా.. ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన ఆయనను కొద్దిరోజుల్లో ఇండస్ట్రీ మర్చిపోతుంది.. కానీ, ఆయన రాసిన పాటలు ముందుతరాల వారు కూడా వింటారు. ఆయన ఎక్కడ ఉన్నా సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. గత కొన్నిరోజుల నుంచి ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతుండడం మనసును కలిచివేస్తోంది” అని చెప్పుకొచ్చారు.

కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా, శ్రేయోభిలాషులకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సిరివెన్నెల తనయుడు యోగేశ్వర శర్మ ఓ ట్వీట్‌ చేశారు.