Mohan Babu: ఇండియాలో ఆ ప‌ని చేసిన వ్యక్తిని నేనే

Mohan Babu: తెలుగు సినీ ప‌రిశ్ర‌మ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల‌లో మోహ‌న్ బాబు ఒక‌రు. విలన్‌గా 400కి పైగా చిత్రాలు, హీరోగా 150కి పైగా చిత్రాలు, నిర్మాతగా 60 చిత్రాలు, విద్యా వేత్తగా కీర్తి ప్రతిష్టతలు సంపాదించారు మోహ‌న్ బాబు. చూడ్డానికి ర‌ఫ్‌గా క‌నిపించే మోహ‌న్ బాబు తప్పును ఉపేక్షించరు, ఎప్పుడూ గంభీరంగా మాట్లాడుతారు.. బయట నుంచి చూసే వారికి ఇవే కనిపిస్తాయి. కానీ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు ఈ స్టార్ హీరో.

రీసెంట్‌గా ఆయ‌న ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ షో 250వ స్పెషల్‌ ఎపిసోడ్‌లో పాల్గొన్న మోహ‌న్ బాబు త‌న జీవితంలో ప‌లు సంఘ‌ట‌ల‌ను తెలియ‌జేశారు . గతాన్ని నెమరువేసుకుంటే తెలయని దుఃఖం వస్తుంది.. నేను ఎంత రఫ్‌గా కనిపిస్తానో అంతకంటే చాలా సెన్సిటివ్‌, తట్టుకోలేను’ అంటూ ఎమోషన్‌ అయ్యారు.

తన విద్యా సంస్థల్లో కులం అనే పదాన్ని తీసేసిన మొదటి వ్యక్తి తానేనన్నారు మోహ‌న్ బాబు. అప్పట్లో కులం ఆధారంగా తనను తీసేసిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో తనకు ఆత్యంత ఆప్తులు చిరంజీవి అన్నారు. ఆర్జీవీది ఒక దారి.. మీది ఒక దారి.. ఈ రెండు దారులు ఎలా కలిశాయి అని ఆలీ అడిగిన ప్రశ్నకు మోహన్‌ బాబు బదులిస్తూ.. ‘టెక్నిషియన్‌గా అతనికి హాట్సాఫ్‌ చెబుతాను వ్యక్తిగతం అంటావా.. మనం మాట్లాడలేం’ అని చెప్పుకొచ్చారు.

మంచి విల‌న్ అవుదామని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. ఇండస్ట్రీలో ఇన్ని యేళ్లు ఉంటానని అనుకోలేదు. ఇక తన ఫస్ట్ పిక్చర్ ’స్వర్గం నరకం’ 22 నవంబర్ 1975లో విడుదలైంది. ఈ సినిమా భక్తవత్సలం నాయుడు కాస్తా మోహన్ బాబుగా మారారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు పేరు పెట్టిన గురువు గారు దాసరిని గుర్తు చేసుకున్నారు. ఇక తన తల్లిదండ్రులకు ఐదుగురు సంతానంలో తాను పెద్దవాడని చెప్పారు. సినిమాల్లో తాను రావడానికి అన్నగారైన ఎన్టీఆర్ ఇన్‌స్పిరేషన్ అన్నారు.