Suriya: సూర్య‌కు వార్నింగ్ ఇచ్చిన మోదీ ప్ర‌భుత్వం..!

Suriya: త‌మిళ నటుడు సూర్య పెద్ద‌గా వివాదాల జోలికి వెళ్ల‌రు. ఆయ‌న‌ది చాలా సున్నిత‌మైన మ‌న‌స్త‌త్వం. త‌న పనేదో తాను చేసుకుంటూ వెళుతుంటారు. ఎవ‌రికైన ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడు త‌న వంతు సాయం చేస్తూ ఉంటారు. ఇటీవ‌ల క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి వ‌ల‌న చాలా మంది ప్ర‌జ‌లు క‌న్నుమూసారు. ఇది చూసి చ‌లించిపోయిన సూర్య త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి కోటీ రూపాయ‌ల విరాళం అందించారు.

Suriya

గ‌తంలోను ఆయ‌న ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయితే సూర్యకు భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ధ్చ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంది ప‌రిస్థితి. తమిళ ప్రముఖ హీరోలు విజయ్, అజిత్, సూర్యలతో తమిళనాడు బీజేపీ విభాగం గతంలో వాగ్వాదాలకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా సూర్య‌ కేంద్ర నీట్ సెలక్షన్ విధానం వల్ల తమిళనాడు పేద విద్యార్థులు నష్టపోతారని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

తాజాగా సినిమాటోగ్ర‌ఫీ బిల్లుపై కూడా సూర్య అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఈ క్ర‌మంలో సూర్య‌పై బీజేపీ విభాగం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తమిళనాడు బీజేపీ యువజన విభాగం కార్యదర్శి వినోద్ సెల్వం అధ్యక్షతన సమావేశమైన కార్యవర్గం..సూర్య వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశం అనంతరం తమిళ బీజేపీ నేతలు సూర్యకు వార్నింగ్ ఇచ్చారు.

Suriya

సూర్య త‌న సినిమాల గురించి ప‌ట్టించుకోకుండా ఇత‌ర విష‌యాల‌పై అన‌వ‌స‌ర జోక్యం అవ‌స‌రం లేదు. త‌ప్పుడు ప్ర‌చారాలు మానుకోవాల‌ని సూచించారు. సూర్య ఇదే రీతీలో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి పాల్పడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ హెచ్చ‌రిక‌ల‌పై సూర్య వాద‌న ఎలా ఉంటుందో చూడాలి.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చివ‌రి చిత్రం “ఆకాశం నీ హద్దురా”. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి ఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రముఖుల డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించారు. ప్రేక్షకులకు అవుట్ ఆఫ్ బాక్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు, హై కన్వర్జేషన్, బజ్, వ్యూస్ తో “ఆకాశం నీ హద్దురా” చిత్రం ఈ అవార్డును సొంతం చేసుకుంది.