MM Keeravani : హాస్పిటల్ బెడ్డుపై కదల్లేని స్థితిలో కీరవాణి.. ప్రాణాంతక వ్యాధి..!
NQ Staff - March 28, 2023 / 11:02 AM IST

MM Keeravani : ఎమ్ ఎమ్ కీరవాణి ఇప్పుడు ఆస్పత్రి బెడ్డుపై కదల్లేని స్థితిలో ఉన్నారు. దాంతో ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాన్ని చూసిన ఆయన ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. రీసెంట్ గానే త్రిబుల్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఆయన పేరు గ్లోబల్ వైడ్ గా మార్మోగిపోతోంది.
ఇండియా వచ్చిన తర్వాత..
కీరవాణి మొన్నటి వరకు వరుసగా ఇంగ్లిష్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సడెన్ గా ఆయన ఆస్పత్రి బెడ్డు మీద ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆయన ఆస్కార్ ప్రమోషన్స్ కోసం చాలా చోట్ల పాల్గొన్నారు. ఆయనకు ఇండియా వచ్చిన తర్వాత అస్వస్థత అనిపించింది.
దాంతో ఆయన ఆస్పత్రికి వెళ్లి చెక్ చేసుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం ఇంకా తెలుగు ఛానెళ్లలో ప్రసారం కావట్లేదు. కానీ మొన్న ఆయన ఇంగ్లిష్ ఛానెళ్ తో మాట్లాడుతూ.. తనకు కరోనా వచ్చిందని.. రేపు ఆస్పత్రి బెడ్ పై ఉంటానని చెప్పారు. దాంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.