MLA Chevireddy : శ‌భాష్ చెవిరెడ్డి.. నీ లాంటి ఎమ్మేల్యేలు మాకు కావాలంటున్న నెటిజ‌న్స్

MLA Chevireddy : తుఫాను వ‌ల‌న ఏపీలో ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే ప్ర‌జ‌లు అకాల వ‌ర్షాల‌తో పాటు వ‌ర‌ద‌ల వ‌ల‌న ప్రాణాలు చేతిలో పెట్టుకొని నివసిస్తున్నారు. అయితే ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు గ‌ట్టిగానే కృషి చేస్తుంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

MLA chevireddy bhaskar reddy lift bags flood relief camp
MLA chevireddy bhaskar reddy lift bags flood relief camp

రాయలచెరువుకు ఎప్పుడు గండి పడుతుందో.. లోతట్టు ప్రాంతాలు ఎప్పుడు మునకేస్తాయోనని అందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే.. ఎమ్మెల్యే చెవిరెడ్డి మాత్రం అక్కడ ఉండే ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో మునిగిపోయారు.

MLA chevireddy bhaskar reddy lift bags flood relief camp
MLA chevireddy bhaskar reddy lift bags flood relief camp

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లలో నిత్యవసర సరుకులు అందిస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. కొంత మంది ఎమ్మెల్యేలు ఇలా కూడా ఉంటారంటూ చెవిరెడ్డికి క్రెడిట్ ఇచ్చేశారు. రాయలచెరువుకు గండి పడితే అధిక భాగం చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాలపైనే పడుతుంది.

దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాత్రి, పగలు రాయలచెరువు వద్దే ఉండి లీకేజీ పూడిక పనులు పర్యవేక్షించారు. లీకేజీని పూడ్చేందుకు భారీగా ఇసుక, కంకర, సిమెంట్ తెప్పించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రాయలచెరువు సమీపంలోని 18 గ్రామాలను ఖాళీ చేయించి తిరుపతిలో పునరావాసం కల్పించారు.

అక్కడున్న ప్రజలకు ఆహారం పంపిణీ చేపట్టేందుకు.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే స్వయంగా నిత్యావసరాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో ముంపు ప్రాంతాలకు చేరవేశారు. రామచంద్రాపురం మండలంలోని సీకేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడుకండ్రిక గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. అలాగే తిరుపతి రూరల్ మండల ప్రాంతంలోని వినాయక్ నగర్ కాలనీలోని నిర్వాసితులకు కూడా నిత్యావసరాలు పంపిణీ చేశారు.