Missing Movie Review: ‘ మిస్సింగ్’ సినిమా రివ్యూ

Missing Movie Review: శ్రీని జోస్యుల దర్శకత్వంలో రూపొందిన మిస్సింగ్ అనే తక్కువ బడ్జెట్ సినిమా ప్రోమోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. నూతన దర్శకుడు హర్ష నర్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. అది ఎలా ఉందో చూద్దాం.

Missing Telugu Movie Review and Rating
Missing Telugu Movie Review and Rating

కథ : గౌతమ్, శృతిల వాహనం యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఈ కారు యాక్సిడెంట్ వెనుక ఏదైనా కుట్ర ఉందా.. వాళ్ళ కారు యాక్సిడెంట్ వెనుక కొంతమంది అనుమానితుల హత్యకు కారణం ఏంటి? ఈ యాక్సిడెంట్ కేసుని జర్నలిస్ట్ మీనా సీరియస్ గా తీసుకోవడం వెనకున్న కారణాలు ఏంటి ? అసలు ఆ నలుగురి హత్యకు ఎవరు ప్లాన్ చేశారు. ఈ స్టోరీలోకి ఏసీపీ త్యాగి, సీఐ లు తమ పాత్రలు ఎలా పోషించారు.. అసలు కార్ యాక్సిడెంట్ లో శృతి ఏమైంది? ఆమెను ఎందుకు, ఎవరు కిడ్నాప్ చేసారు. చివరకు ఆమె దొరికిందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

నటీనటుల పర్ఫార్మెన్స్ : ఆధ్యంతం సస్పెన్స్ తో సాగే ఈ కథనంలో హీరో హర్ష నర్రా పాత్రతోనే సినిమా అంతా నడుస్తుంది. హీరో హర్ష ఇంకొంచెం మెచ్యూర్డ్ యాక్ట్ చేసుంటే సినిమాకి హైప్ క్రియేట్ అయ్యేది. కీలక సన్నివేశాల్లో తన ఎమోషన్స్ కి తగ్గట్లుగా నటించారు. హీరో డైలాగ్ డెలివరీతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా ప్లస్ అయ్యింది. ఇక హీరోయిన్లు విషయంలో సినిమాకి డల్ గా నిలిచింది. తన పాత్ర వరకు నటించిన నికిషా యాక్టింగ్ పర్లేదనిపించింది. జర్నలిస్ట్ గా మిషా నారంగ్ నటన ఒకే అనిపించుకుంది.

Missing Telugu Movie Review and Rating
Missing Telugu Movie Review and Rating

టెక్నికల్ టీం ప‌నితీరు : డైరెక్టర్ శ్రీని జోస్యులు రాసుకున్న కథ ఈ సినిమాకు బలం. ఇక చిన్నస్థాయి టెక్నికల్ టీమ్ తో సినిమా మొత్తాన్ని నడిపించారు. కథలో ట్విస్టులు బావున్నాయి . గానీ డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని ప్రేక్షకుడికి రీచ్ అయ్యేలా చేయకపోవడం కాస్త నిరాశను తెప్పిస్తుంది. ఎడిటింగ్ కి కాస్త పని చెప్పాలి. సినిమాటోగ్రఫీ పర్లేదనిపించుకుంది.

ప్లస్ పాయింట్స్ :

  • హీరో యాక్టింగ్,
  • డైరెక్టర్ టేకింగ్

మైనస్ పాయింట్స్ :

  • ఎడిటింగ్,
  • సెకండాఫ్ సాగదీత సీన్స్

విశ్లేషణ : ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మిస్సింగ్ మూవీ ఒకే అనిపించుకుంది. థ్రిల్లర్ సినిమాల్ని ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా కాస్త ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. అయితే 2 గంటల సేపు ప్రేక్షకుడ్ని థియేటర్ లో కూర్చోబెట్టే ప్రయత్నంలో డైరెక్టర్ విఫలమయ్యాడనే చెప్పుకోవాలి.

చివరగా : సస్పెన్స్ మిస్ అయిన మిస్సింగ్ మూవీ

రేటింగ్: 2.25/5