Bigg Boss Himaja: బిగ్ బాస్ హిమ‌జ ఇంట్లో సాయి బాబా విగ్ర‌హం నుండి ఉబికి వ‌చ్చిన విబూది

Bigg Boss Himaja: చిన్న చిన్న సీరియ‌ల్స్ చేసుకుంటూ, అలానే ప‌లు టీవీ షోల‌కు యాంక‌రింగ్ చేసుకుంటూ వ‌స్తున్న చాలా మంది బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. అందులో హిమ‌జ కూడా త‌ప్ప‌క ఉంటుంది. తెలుగు నటి హిమజ ఒకరు మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Miracle at Biggboss Himaja Home
Miracle at Biggboss Himaja Home

నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హిమజ. కెరీర్ ఆరంభంలో సీరియళ్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. ‘స్వయంవరం’ అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఆమె.. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అనే సీరియల్‌తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లను దక్కించుకుని సత్తా చాటిందీ బ్యూటీ.

Miracle at Biggboss Himaja Home
Miracle at Biggboss Himaja Home

తన కెరీర్‌లో ‘శివమ్’, ‘నేను శైలజ’, ‘ధృవ’, ‘శతమానంభవతి’, ‘స్పైడర్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘వినయ విధేయ రామ’, ‘చిత్రలహరి’ సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ‘ఆచార్య’లోనూ చేస్తోంది. బిగ్ బాస్ త‌ర్వాత ఈ అమ్మ‌డి కెరీర్ పూర్తిగా మారింది. కాస్ట్ లీ కార్లు, రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తూ షాకిస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హిమ‌జ తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆస‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డించింది.

తన ఇంట్లో ఉన్న ఒక సాయి బాబా విగ్రహం నుంచి విబూది రాలుతుందని బాబా విగ్రహం ముందు ఉన్న నీళ్లలో తులసి వాసన వచ్చింద‌ని స్వయంగా హిమజ చెప్పింది. ఇంటర్ చదువుతున్న సమయం నుంచి సాయిబాబా విగ్రహం తమ ఇంట్లో ఉందని.. 2004లో రమణానంద స్వామీజీ పరిచయం అయ్యారు. అప్పుడు ఆయన బాబాకి 19 రోజులు హోమం కూడా చేశాం. ఇక అప్పటి నుండి రోజు సాయిబాబా విగ్రహం తుడవడం, ముందున్న నీళ్ళని మార్చటం, పూజలు చేయటం నా డ్యూటీ అయిపోయింది.

ఓ రోజు విగ్ర‌హం క్లీన్ చేయ‌డానికి వెళితే చుట్టూ విబూది ఉంది. అది మ‌మ్మ‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అప్పుడు తాము సాయి భజన పెట్టుకున్నామని.. ఇది ఎవరు నమ్మరని.. జీవితంలో అనుభవంలోకి వస్తేనే తెలుస్తుందని.. తానూ ఎవ్వర్నీ నమ్మించడానికి ఈ విషయం చెప్పటం లేదని హిమ‌జ చెప్పుకొచ్చింది. ఇదినా జీవితంలో గ్రేట్ ఫీలింగ్ అంటూ ఈ అమ్మ‌డు పేర్కొంది.