Minister Roja : బాలయ్య అక్కినేని వ్యాఖ్యలపై రోజా స్పందన.. రాజకీయం
NQ Staff - January 25, 2023 / 03:42 PM IST

Minister Roja : వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఆ రంగారావు ఈ రంగారావు.. అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారంను రేపుతున్నాయి. ఇప్పటికే అక్కినేని వారసులు బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది.
తాజాగా మంత్రి రోజా ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు పై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎన్టీఆర్ పై ఎవరైనా చేసి ఉంటే బాలకృష్ణ ఎలా స్పందించే వారంటూ ఆమె ప్రశ్నించారు.
ఇటీవల బాలకృష్ణ చేసిన ప్రతి వ్యాఖ్య కూడా వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు రాజకీయంగా మరింత దుమారం రేపుతున్నాయి. సినీ వర్గాల నుండి రాజకీయ వర్గాల వరకు బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాయి.
టాలీవుడ్ కి చెందిన గొప్ప నటుడు అయినా అక్కినేని నాగేశ్వరరావు గురించి తక్కువ చేసి మాట్లాడడం కచ్చితంగా తప్పే అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా మాటలు అనలేదని ఫ్యాన్స్ అంటున్నారు.
ఆయనకి పెద్ద వారు అంటే అపారమైన గౌరవం ఉంటుందని, ఏదో ఉత్సాహంలో అలాంటి మాటలు మాట్లాడారే తప్పితే మనసులో నుండి వచ్చిన మాట కాదు అది అంటూ నందమూరి అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. రోజా ఈ విషయమై స్పందించడంతో రాజకీయంగా మరింత రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.