Chiru-NTR: ఎన్టీఆర్, చిరంజీవిల‌ను వెంట వెంట‌నే క‌లిసిన తెలంగాణ మంత్రి

Chiru-NTR: ఈ మ‌ధ్య కాలంలో సినీ సెల‌బ్రిటీలకు, రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌ధ్య మంచి అవినావభావ సంబంధం ఏర్ప‌డింది. ముఖ్యంగా సినిమా వాళ్ల ఫంక్ష‌న్స్‌కు మంత్రులు చీఫ్ గెస్ట్‌లుగా హాజ‌ర‌వుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. కేటీఆర్, పువ్వాడ అజయ్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వంటి వారు సినిమా ఫంక్ష‌న్స్‌కు త‌ర‌చుగా హాజ‌ర‌వుతూ సినిమా ప్రేక్ష‌కుల‌ని కూడా అల‌రిస్తున్నారు. ఆ మ‌ధ్య చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ కోసం అని ఖ‌మ్మం వ‌చ్చి పువ్వాడ అజ‌య్ కుమార్ ఇంట్లో ఏకంగా బ‌స చేశారు కూడా.

Chiru-NTR

కేటీఆర్ మాదిరిగానే పువ్వాడ అజ‌య్ కూడా సినిమా పరిశ్ర‌మ‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌ర‌చుకుంటున్నారు. తాజాగా ఆయ‌న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ని క‌లిసారు. ఆ స‌మ‌యంలో అజ‌య్‌తో పాటు ఆయ‌న కుమారుడు నయన్ కూడా ఉన్నారు. డాక్ట‌ర్ న‌య‌న్ బర్త్ డే నాడు ఆయన్ను కలవడం సంతోషంగా ఉందని అన్నారు పువ్వాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి, మంత్రి కేటీఆర్‌లను కూడా కలిసి ఆశిర్వాదం తీసుకున్నారు పువ్వాడ నయన్.

తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్టీఆర్, చిరును తమ తమ ఇళ్లలోనే ప్రత్యేకంగా క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే అజ‌య్.. కేటీఆర్‌నికూడా క‌లిసి ఆశీస్సులు అందుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం సినీ పరిశ్ర‌మ‌తో పాటు రాజ‌కీయాల‌లోను పువ్వాడ‌, చిర‌, ఎన్టీఆర్ భేటిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.

Chiru-NTR

ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ పూర్తికాగానే కొరటాల శివతో మరో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలోను జూనియ‌ర్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు టాక్.

ఇక చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు.కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌.ఈ సినిమా ద‌స‌రాకు రిలీజ్ కానుంది. ఆచార్య చిత్రం త‌ర్వాత చిరు లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్నాడు.