Harish Rao: భలే పేరు పెట్టావు ‘‘చిచ్చా’’

Harish Rao చిచ్చా అనే మాటని తెలంగాణలో బాగా వాడతారు. దీనికి అర్థం బాబాయ్. ఫ్రెండ్స్ ఎక్కువగా చిచ్చా.. బాబాయ్.. మామా.. కాకా.. అనే వరసలతో క్లోజ్ గా పిలుచుకుంటూ ఉంటారు. అందుకే ఈ చిచ్చా అనే తెలంగాణ బ్రాండ్ ని ఒక తెలుగు సినిమాకి టైటిల్ గా పెట్టారు. దీంతో అది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి తెగ నచ్చింది. మూవీకి మంచి పేరు పెట్టినందుకు ఈ సినిమా హీరో రాహుల్ సింప్లిగంజ్ ని ఆయన మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. ఈ పిక్చర్ కి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని ముందుకొచ్చారు.

పోస్టర్, సాంగ్ రిలీజ్..

చిచ్చా’ ఫిల్మ్ పోస్టర్, టైటిల్ సాంగ్ ని మంత్రి హరీష్ రావు ఇవాళ శనివారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం పేరు ఆకట్టుకునేలా, తెలంగాణ భాషను ప్రమోట్ చేసేలా ఉందని అన్నారు. ‘రాహుల్ సింప్లిగంజ్ మన తెలంగాణ బిడ్డ. ఈ మూవీ బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. రాహుల్ టాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ కి ఎదగాలి. బిగ్ బాస్ రియాలిటీ షోని ఎలా హిట్ చేశాడో, ఏవిధంగా విజేతగా నిలిచాడో అలాగే ఈ సినిమాను కూడా సూపర్ సక్సెస్ చేయాలి’’ అని హరీష్ రావు ఆకాంక్షించారు.

‘ఊకో కాక’కి మరో బ్రాంచ్..

‘‘ఊకో కాక’’ అనే పేరుతో మొట్టమొదటి బట్టల షాపును కరీంనగర్ లో ప్రారంభించిన రాహుల్ సింప్లిగంజ్ రెండో బ్రాంచ్ ని రెండు నెలల కిందట హైదరాబాద్ లో ఓపెన్ చేశాడు. ఈరోజు మూడో శాఖని సిద్దిపేటలో అందుబాటులోకి తెచ్చాడు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావుని ఆహ్వానించిన రాహుల్ ఇక్కడే తన సినిమా టైటిల్ పోస్టర్ ని, సాంగ్ ని కూడా విడుదల చేయించాడు. ఊకో కాక అనే పేరు ఎంత లైవ్లీగా ఉందో చిచ్చా అనేది కూడా అంతే ఇంట్రస్టింగ్ గా, క్యాచీగా ఉందని సినీ అభిమానులు అంటున్నారు. టైటిల్ సాంగులో సైతం బచ్చా, లుచ్చా అనే పక్కా తెలంగాణ పదాలు వాడారు. ఈ పాటని రాహులే పాడాడు. ఆర్.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ ‘చిచ్చా’ సినిమాకి మల్లిక్ కందుకూరి డైరెక్టర్. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తారు.