Tamannah : 11త్ అవర్ వెబ్ సిరీస్ తో రాబోతున్న మిల్కీ బ్యూటి తమన్నా..!
Vedha - March 24, 2021 / 05:00 PM IST

Tamannah : టాలివుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటి అనగానే గుర్తొచ్చేది తమన్నా భాటియా. శ్రీ సినిమాతో తెలుగులో ఇండస్ట్రీలో అడుగుబెట్టింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్ తో గుర్తింపుని పొందింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలని చేసి తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 100% లవ్, బద్రీనాథ్, ధనుష్ సరసన వేంగై సినిమాలో నటించింది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా తన నటనకు మంచి స్పందన లభించింది. రాం చరణ్ తో రచ్చ, అలాగే రాం తో ఎందుకంటే…ప్రేమంట!, ప్రభాస్ రెబెల్ సినిమాల్లో ఇలా ఎన్నో సినిమాలలో నటించింది. ప్రభుదేవ తో అభినేత్రి సినిమాలో నటించింది. ఈ సినిమాలో తమన్నా నటనకు, అందాల ప్రదర్శనకు, డాన్సుకు మంచి స్పందన లభించింది. అలాగే ఎందరో స్టార్ హీరోస్ తో కలిసి నటించింది. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్ తో ఎంటర్టైన్ చేసింది.

milky beauty tamannah is in web series with 11th hour
లాక్ డౌన్ సమయంలో దాదాపు గా సిమాలన్ని ఓటీటీలోనే రిలీజ్ చేయాలని భావించారు. అందుకే ఓటీటీ బిజినెస్ కూడా బాగానే పెరిగింది. ప్రేక్షుకలు వినోదం కోసం దాదాపు ఓటీటీనే ఆశ్రయించారు. మళ్లీ థియేటర్లు 50% ఆక్యుపెన్సి తో సినిమాలని రిలీజ్ చేసుకోవడం తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా ఓటీటీకి మాత్రం డిమాండ్ తగ్గలేదు. అందుకేనేమో రేపటి రోజు ఎలా ఉన్నా అన్న ఆలోచనతో హీరోలు మరియు హీరోయిన్స్ కూడా ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు. సమంత ధి ఫ్యామిలి మాన్ వెబ్ సీరిస్ తో, శృతిహాసన్, హెబ్బా పటేల్ … పిట్ట కథలతో ఇలా పలు రకాల కాన్సెప్ట్స్ తో మన ముందుకు వస్తున్నారు. అయితే ఈ వెబ్ సీరిస్ కూడా అందరికి కలిసివచ్చిందో లేదో తెలియదు కాని కాజల్ కి మాత్రం కలిసి రాలేదనే తెలుస్తుంది. కాజల్ చేసిన ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ నిరాశ పర్చింది.
Tamannah : వెబ్ సిరీస్ లలో తమన్నాకి క్రేజీ ఆఫర్స్..!
ఇప్పుడు తమన్నా కూడా ఈ వెబ్ సీరిస్ పై ఆసక్తి కనబరుస్తుంది. ప్రస్తుతం తమన్నా నటించిన 11త్ అవర్ వెబ్ సిరీస్ ఆహా లో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. దీనికి సంబందించిన వార్త ఒకటి కొన్ని నెలల క్రితమే ఆహా వారు ఈ వెబ్ సిరీస్ ను ప్రకటించారు. అయితే ఏప్రిల్ 9వ తారీకున 11త్ అవర్ ను స్ట్రీమింగ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించడాని తెలుస్తుంది. ఒక వేళ తమన్నా సక్సెస్ అయితే గనక చాలా మంది హీరోయిన్స్ మరియు హీరోలు కూడా వెబ్ సిరీస్ లకు క్యూ కట్టే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ వెబ్ సిరీస్ లకి మాత్రమే స్టికాన్ అవకుండా అటు సినిమాలలో అవకాశాల కోసం రెడిగానే ఉంది మన మిల్కీ బ్యూటి.