Tamannah : క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా…!

Tamannah : ఇటీవల కరోనా కారణంగా ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ సినిమా హీరోయిన్స్ అందరు వెబ్ సిరీస్ లలో తమ సత్తా చాటేందుకు రెడీగా ఉంటున్న విషయం తెలిసిందే. సమంత, శృతి హాసన్, నిత్యా మినన్, ఈషా రెబ్బ, అమలాపాల్ సహా పలువురు సౌత్ అండ్ నార్త్ స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ తో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా కూడా డిజిటల్ రంగంలోకి లోకి ప్రవేశించి డిఫ్రెంట్ జోనర్‌లో రూపొందుతున్న వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే.  రీసెంట్ గా ఆహా కోసం లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఒక క్రైం థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో మరో కొత్త స్టొరీ తో మే 14న ప్రేక్షలుల ముందుకు రాబోతుంది.

milky beauty tamannah in crime thriller web series...!
milky beauty tamannah in crime thriller web series…!

నవంబర్ స్టోరీ అని టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో తమన్నా ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. ఈ వెబ్ సిరీస్ కు ఇంద్రా సుబ్రమణ్యన్ దర్శకత్వం వహించగా ఆనంద వికటన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ని తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన
అధికారక ప్రకటన కూడా వెలువడింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. కాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ దక్కించుకుంది.

Tamannah : అనురాధ గణేశన్ గా తమన్నా….!

ప్రముఖ క్రైమ్ నవల రచయిత గణేశన్ కూతురుగా .. తమన్నా అనురాధ గణేశన్ అనే పేరుతో కనిపించబోతుందట. ఓ క్రైమ్‌తో సంబంధం కలిగి ఉందన్న ఆరోపణల నుంచి తనని తను ఎలా రక్షించుకోగలిగిందనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కథ సాగుతుందట. ఇక ఈ వెబ్ సిరీస్ ని ఈద్ సందర్భం గా మే 14న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం తమన్నా గోపిచంద్ తో సీటీమార్ సినిమాలో నటించింది. కరోనా కారణం గా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అలాగే నితిన్ ప్రస్తుతం నటిస్తున్న బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ రీమేక్ మాస్ట్రో సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మెయిన్ హీరోయిన్ కాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం.

Advertisement