Aha : ఆహా కోసం మరోసారి మిల్కీ బ్యూటి….!

Aha : ఆహా అనేది మొదటి తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్. ఈ వేదిక లో సినిమాలు, వెబ్ సీరిస్లు ఎక్స్‌క్లూజివ్స్, టాక్ షోస్, ఇలా చాలా రకాలుగా వివిధ ప్రోగ్రాంస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ పర్యవేక్షణలో ఈ ఆహా వేదికలో ప్రోగ్రాంస్ డిజైన్ చేయబడుతున్నాయి.

milky beauty in aha once again
milky beauty in aha once again

చాలా వరకు సినిమాలని థియేటర్లలో విడుదల చేయదలచి కూడా ప్రభుత్వ ఆంక్షల మేరకు కొన్ని సినిమాలని ఈ ఆహా స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా ఓటిటి లో విడుదల చేసుకున్నారు. డిసెంబర్ లో థియేటర్స్ ఓపెన్ అయినప్పటికి అంతకు ముందుల జనాలు థియేటర్స్ కి రావడానికి ఇష్టపడకపోవడం వల్ల ఈ ఆప్ సర్వీసులను వెబ్ సీరిస్లతో, టాక్ షో లతో ఇంకా ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే సమంత సాం జాం షో, రానా నంబర్ వన్ యారి షోస్ హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ ఆప్ ద్వారా వెబ్ సీరిస్ ల వెల్లువ ఏమాత్రం తగ్గడం లేదు.

Aha : ఆహాలో తమన్నా టాక్ షో చేయనుందా…?

తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ చేసింది. ట్రైలర్ తో ఆకట్టుకున్నా ఈ వెబ్ సిరీస్ ఊహించినంత ఫలితాన్ని మాత్రం దక్కించుకోలేక పోయింది. ‘లెవెన్త్ అవర్’ వెబ్ సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమన్నా గ్లామర్ బ్యూటీ అని మనకు తెలిసిన విషయమే అందుకనెనేమో ఏ మాత్రం తగ్గకుండా ఆహాలో ఒక టాక్ షో ప్లాన్ చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్న ప్రస్తుతానికి తమన్నా గోపిచంద్ తో సీటీమార్ అనే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది. ఆ సినిమా పూర్తి కాగానే మరో ఇంటరెస్టింగ్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుందో లేక టాక్ షో తో షాక్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement