Suma: వెరైటీ కేక్.. యాంకర్ సుమ బర్త్ డే పిక్స్ వైరల్

Suma యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. బుల్లితెర పై ఎదురులేని తిరుగులేని యాంకర్‌గా దశాబ్దానికి పైగా రాణిస్తూనే ఉంది. ఎంతో గ్లామర్ అందాలను ఎరవేసి యాంకర్లుగా స్థిరపడిపోవాలని చూశారు. కానీ సుమ స్థానాన్ని మాత్రం ఇంచు కూడా కదిలించలేకపోయారు. అలా సుమ తన ముద్రను ప్రేక్షకుల పై అంత బలంగా వేసింది. నిన్న సుమ బర్త్ డే. ఈ క్రమంలో టాలీవుడ్ మొత్తం సుమకు ప్రత్యేకంగా విషెస్ అందించింది.

అయితే తాజాగా సుమ కూడా తన బర్త్ డే వేడుకలు జరిగిన తీరు గురించి వివరించింది. మీరు పంపిన విషెస్ చూశాను.. ఎంతో ఆనందంగా ఉంది.. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం నాకు అందాయి.. ఎంతో సంతోషంగా ఉందని బర్త్ డే విషెస్ చెప్పిన వారందరికీ సుమ థ్యాంక్స్ చెప్పింది. ఇక నిన్న రాత్రి తన బర్త్ డే ఎలా జరిగిందో.. తన ఫ్రెండ్స్ ఎలా సెలెబ్రేట్ చేశారో కూడా వివరించింది. ఈ క్రమంలో వెరైటీ కేక్‌ను తయారు చేయించారట.

mike-cake-in-anchor-suma-birthday-celebration
mike-cake-in-anchor-suma-birthday-celebration

వెరైటీ కేక్.. యాంకర్ సుమ బర్త్ డే పిక్స్ వైరల్

సుమ బర్త్ డే ఆమె సన్నిహితులు, ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. నిన్న నా స్నేహితులతో గడిపిన క్షణాలు ఎంతో విలువైనవి. మైక్ కేక్‌ను అలా స్పెషల్‌గా డిజైన్ చేయించినందుకు కీర్తికి చాలా థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది. నిత్యం మైక్ పట్టుకుని గోల చేసే సుమకు.. మైక్ రూపంలో ఉన్న కేక్‌ను డిజైన్ చూసి తీసుకొచ్చారు. దీంతో సుమ కూడా షాక్ అయినట్టుంది. ప్రస్తుతం సుమ బుల్లితెర పై ఎన్ని షోలతో బిజీగా ఉందో అందరకీ తెలిసిందే. స్టార్ట్ మ్యూజిక్, స్టార్ మహిళా, క్యాష్, బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అంటూ రచ్చ చేస్తోంది

Advertisement