Mehreen: బ్రేకప్ తర్వాత మెహ్రీన్ స్టన్నింగ్ పోస్ట్.. అంతరార్ధం ఏమై ఉంటుందా అని ఆలోచనలు
Samsthi 2210 - July 10, 2021 / 03:51 PM IST

Mehreen: పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ మరి కొద్ది రోజులలో పెళ్లి చేసుకోవలసింది పోయి నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తికి బ్రేకప్ చెప్పానని ఇటీవల తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో నేడో రేపో పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తుందేమో అనుకుంటున్న తరుణంలో ఉన్నట్లుండి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది మెహ్రీన్.
సడెన్‌గా మెహ్రీన్ తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం పట్ల అనేక వార్తలు వచ్చాయి. భవ్యతో తన ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నమెహ్రీన్.. ఇక నుంచి అతడి కుటుంబంతో కానీ, అతడితో కానీ ఎలాంటి సంబంధాలు ఉండవని తేల్చేసింది . అయితే పెళ్లి రద్దు కావడం పట్ల సోషల్ మీడియాలో ఎవరికి తోచిన కారణాలు వాళ్లు రాస్తున్నారు. ఇదే విషయంపై భవ్య బిష్ణోయ్ సీరియస్ అయ్యాడు.
తనపై కానీ.. తన కుటుంబంపై కానీ ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్పాల్సిన అవసరం తనకు లేదని.. అవసరం కూడా లేదని.. చెప్పనంటున్నాడు భవ్య. ఎవరైనా తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు.
ఇక భవ్య ట్వీట్ చేసిన కొద్ది రోజులకి మెహ్రీన్ తన సోషల్ మీడియాలో మరో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి మీ కత్తి మీద ఆధారపడడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకే సొంతంగా ఓ కత్తి ఉంటుంది’అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.
కాస్త కన్ఫ్యూజింగ్‌గా చెప్పిన మెహ్రీన్ చేసిన పోస్ట్‌లో అంతరార్ధం చాలానే ఉందని నెటిజన్స్ కామెంట పెడుతున్నారు. మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ పక్కన హనీ పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న మెహ్రీన్ మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు.