Mehreen: మెహ‌రీన్ ఎంగేజ్‌మెంట్ వైబ్స్ మొద‌లు.. ఫొటోలు వైర‌ల్‌

Samsthi 2210 - March 9, 2021 / 12:09 PM IST

Mehreen: మెహ‌రీన్ ఎంగేజ్‌మెంట్ వైబ్స్ మొద‌లు.. ఫొటోలు వైర‌ల్‌

Mehreen టాలీవుడ్ అందాల భామ‌లకు పెళ్లి ఘ‌డియ‌లు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. ప్రేమించిన వ్య‌క్తుల‌తో ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఇప్ప‌టికే క‌లువ క‌ళ్ళ సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని పెళ్లి చేసుకోగా, వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. కాజ‌ల్ పెళ్లైన కొద్ది రోజులకే మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా పెళ్లి పీట‌లెక్కింది. చైత‌న్య అనే వ్య‌క్తిని రాజ‌స్థాన్‌లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా పెళ్ళాడి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. నిహారిక పెళ్లి మెగా ఫ్యామిలీ మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

ఇక ఇప్పుడు మెహ‌రీన్‌కు టైం వ‌చ్చింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఏడ‌డుగులు వేసేందుకు స‌న్న‌ద్ధ‌మైంది. కొద్ది రోజుల క్రితం తాను భ‌వ్య అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది మెహ‌రీన్. దీంతో అమ్మ‌డికి నెటిజ‌న్స్‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే రాజస్థాన్‌లోని జైపుర్‌ అలీలా కోటలో మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుండ‌గా, జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు ఇద్ద‌రు సిద్ధంగా ఉన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

మార్చి 13న జ‌ర‌గ‌నున్న ఎంగేజ్‌మెంట్ వైబ్స్ మొద‌ల‌య్యాయి. త‌న భ‌ర్త‌తో క‌లిసి దిగిన క్యూట్ పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ ని అల‌రించింది. ట్రెండీ దుస్తుల‌లో ఇద్ద‌రు చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నారు. కృష్ణగాడి వీరప్రేమగాథ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మహానుభావుడు, రాజా ది గ్రేట్‌, నోటా, ఎఫ్‌-2 చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహ‌రీన్ ప్ర‌స్తుతం ఎఫ్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉంది. వ‌రుణ్ తేజ్, వెంకటేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. ఆగ‌స్ట్ 27న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us