Mehreen: నాగార్జున‌తో రొమాన్స్‌కి కోటిన్న‌ర డిమాండ్ చేస్తున్న మెహ్రీన్…!

Mehreen: సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న సంద‌డి చేయ‌డానికి హీరోయిన్స్ క‌రువయ్యారు. ఫేడ్ ఔట్ అయిన హీరోయిన్‌ల‌తో న‌డిపిద్దాము అంటే వారు భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. తాజాగా పంజాబీ ముద్ద‌గుమ్మ మెహ్రీన్.. నాగార్జున స‌ర‌స‌న న‌టించ‌డానికి కోటిన్న‌ర డిమాండ్ చేసింద‌ట‌. నిర్మాత‌లు మ‌రోసారి అడ‌గ‌గా కోటి పాతిక ల‌క్ష‌ల నుండి త‌గ్గ‌ను అంటుంద‌ట‌.

mehreen ready to act with nagarjuna
mehreen ready to act with nagarjuna

నాగార్జున ప్ర‌స్తుతం ది ఘోస్ట్ అనే చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇందులో క‌థానాయిక‌గా కాజ‌ల్‌ని అనుకున్నారు. కాని ఆమె అనివార్య‌కార‌ణాల వ‌ల‌న ప‌క్క‌కు త‌ప్పుకుంది. ఇక అమ‌లాపాల్‌ని కాజ‌ల్ ప్లేస్‌లో భ‌ర్తీ చేయాల‌ని ప్లాన్ చేశారు. కాని కుదర‌లేదు. ఆమె బాగా డిమాండ్ చేయ‌డంతో వేరే ఆప్ష‌న్ కోసం చూశారు. మెహ‌రీన్‌ని సంప్ర‌దిస్తే సీనియ‌ర్ హీరో కాబ‌ట్టి భారీ పారితోషికం ఇవ్వాల‌ని డిమాండ్ చేసింద‌ట‌. ఇది చూసి నిర్మాత‌లు ఖంగుతిన్నారు.

మెహ్రీన్ పిర్జాదా.. కృష్ణగాడి వీర ప్రేమగధ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ అందాల భామ . మొదటి సినిమాతోనే అందంతో నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ. రీసెంట్‌గా మంచి రోజులు వ‌చ్చాయి అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇది నిరాశ‌ప‌ర‌చింది. వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్3 చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకుంది.

హీరోయిన్ మెహ్రీన్, ఆ మధ్య తన పెళ్లిని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. లెక్కప్రకారం హర్యాణా మాజీ ముఖ్యమంత్రి మనవడితో ఈ నెల్లోనే ఆమె పెళ్లి జరగాలి. కానీ ఎంగేజ్ మెంట్ తోనే అది ఆగిపోయింది. పెళ్లికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ఎవరి దారులు వాళ్లు చూసుకున్నారు. పెళ్లి రద్దు అంటూ అధికారికంగా ప్రకటించి, గుంభనంగా తప్పుకున్నారు.

mehreen ready to act with nagarjuna1.pg
mehreen ready to act with nagarjuna1.pg

ఆ తర్వాత సినిమాలు, ఫొటోషూట్లలో బిజీ అయిపోయింది మెహ్రీన్. అలా ఆమె తన పెళ్లి కాన్సిల్ అయిన ఘటన నుంచి తొందరగానే బయటపడిందని అంతా అనుకున్నారు. కానీ మెహ్రీన్ మనసులో మాత్రం ఆ బాధ ఇంకా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె పెడుతున్న పోస్టులు చూస్తే ఈ విషయం అర్థమౌతోంది.