MEHREEN: ఈ ఏడాది పెళ్లి లేన‌ట్టేన‌ని తేల్చేసిన మెహ‌రీన్.. పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లో వెల్ల‌డిస్తానంటున్న ఎఫ్ 2 బ్యూటీ

క‌రోనా స‌మ‌యంలో సెల‌బ్రిటీలు అంద‌రు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. తెలుగు నటి మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌తో మార్చి 12న ఘనంగా నిశ్చితార్థం జ‌రుపుకోగా, వీరి వివాహం మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నుంద‌ని అంతా భావించారు. కాని ప్రస్తుత కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లిని నిరవధికంగా వాయిదా వేశారు. వచ్చే ఏడాది చేసుకోవాలనుకుంటున్నారట.

భ‌వ్య నేను పెళ్లి గురించి చ‌ర్చించుకోవ‌డం లేదు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయ‌ని ఆశిస్తున్నాం. అప్ప‌టి వ‌ర‌కు మా పెళ్లి జ‌ర‌గ‌దు అని మెహ‌రీన్ పేర్కొంది. నిశ్చితార్థం త‌ర్వాత మెహ‌రీన్ క‌రోనా బారిన ప‌డ‌డంతో ఇలాంటి స‌మ‌యంలో పెళ్లి జ‌ర‌ప‌డం భావ్యం కాదని అంద‌రు భావిస్తున్నారు. కరోనా నుంచి కోలుకునే సమయంలో భవ్యా బిష్ణోయ్‌ తనకు ఎంతో అండగా ఉన్నారని మెహరీన్‌ తెలిపారు.తెలుగులో నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మంచి విజయం సాధించింది. అంతే కాకుండా మెహ్రీన్‌కు మంచి నటి అని పేరోచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మహానుభావుడు’ సినిమా చేసింది. ఆ త‌ర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి చిత్రాల‌తోను మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది మెహ‌రీన్.