MEHREEN : శీతాకాలంలో మెహ్రీన్ కౌర్ వివాహం.. రెండు సంప్ర‌దాయాల‌లో జ‌ర‌గ‌నున్న ఎఫ్ 2 బ్యూటీ పెళ్లి

MEHREEN : కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ముద్దుగ‌మ్మ మెహ్రీన్ కౌర్. చివ‌రిగా ఎఫ్ 2 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని తెగ న‌వ్వించింది ఈ బ్యూటీ. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న హ‌నీగా మెహ్రీన్ పోషించిన న‌ట విన్యాసాన్ని ఎవ‌రు అంత ఈజీగా మ‌ర‌చిపోరు. ఇప్పుడు ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఎఫ్ 3 చిత్రంలోను న‌టిస్తుంది. ఎఫ్ 3 చిత్రం ఆగస్ట్ 27న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తుంది మెహ్రీన్.

మెహ్రీన్ కౌర్ ప్రొఫెష‌న‌ల్ లైఫ్ సాఫీగా సాగుతుండ‌గా, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ఆశ్య‌ర్య‌ప‌రిచే నిర్ణ‌యం తీసుకుంది . రీసెంట్‌గా హ‌ర్యానా మాజీ సీఎం మ‌న‌వ‌డు భ‌వ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. శీతాకాలంలో తాను పెళ్ళిచేసుకునేందుకు సిద్ధం కాగా, ఈ పెళ్లి పంజాబీ, హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రుగుతుంద‌ని చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి త‌ర్వాత మెహ్రీన్ కౌర్ సినిమాలు చేయ‌ద‌ని అంద‌రు అంటున్న నేప‌థ్యంలో మెహ్రీన్ కౌర్ క్లారిటీ ఇచ్చింది. న‌న్ను అర్ధం చేసుకున్న భ‌ర్త దొరికినందుకు సంతోషంగా ఉంది. ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ లైఫ్ రెండు మేనేజ్ చేసుకుంటాను. పెళ్ల‌య్యాక ఢిల్లీకి వెళ్లి అక్క‌డే ఉంటానంటూ ఆస‌క్తికర విష‌యాల‌ను చెప్పుకొచ్చింది పంజాబీ ముద్దుగుమ్మ‌.

Advertisement