Mehreen: ఆ హీరోయిన్‌కి బ్రేక‌ప్ అయిన బెంగే లేదు.. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది..!

Mehreen: సెల‌బ్రిటీల ప్రేమ‌, పెళ్లి, విడాకులు అనేవి సినిమా స్టైల్‌లోనే ఉంటాయి. సెలబ్స్‌కి అప్పుడే ప్రేమ‌, పెళ్లి అంటారు అంత‌లోనే విడాకులు అంటారు.ఇటీవ‌ల అమీర్ ఖాన్ త‌న 15 ఏళ్ల వివాహ బంధానికి స్వ‌స్థి ప‌లికిన విష‌యం తెలిసిందే. ఇక ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన భామ మెహ్రీన్ పిర్జాదా మ‌రి కొద్ది రోజుల‌లో పెళ్లి పీట‌లెక్కుతుంద‌ని అంద‌రు భావిస్తున్న క్ర‌మంలో ఆమె భ‌వ్య అనే వ్యక్తికి బ్రేక‌ప్ చెప్పింది.

mehreen

హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న మెహ్రీన్‌.. ఇటీవల బ్రేకప్‌ చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చింది. పెళ్లి రద్దు విషయం తన పర్సనల్‌ అని, ఇకపై దీని గురించి చర్చ జరగకుండా ఉంటే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఈ అంశం మీద మాట్లాడిన భవ్య కూడా తాను ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లు చెప్పుకొచ్చాడు.

సాధారణంగా ఎవరైనా నిశ్చితార్థం బ్రేక్ అయితే.. కాస్త దుఖంలో ఉంటారు. కొన్ని రోజుల పాటు ఎవరికి కనిపించకుండా ఉంటారు. ఇంకొందరు అయితే డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోతారు. కానీ, మెహ్రీన్‌లో మాత్రం ఆ బాధ ఏమాత్రం లేనట్లే అనిపిస్తుంది. మంచిగా బీచ్‌ల వెంట తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నిశ్చితార్ధం క్యాన్సిల్ అయింద‌నే బాధ ఇసుమంత కూడా ఆమెలో లేదు.

mehreen

పొట్టి డ్రెస్ వేసుకొని.. నడుము అందాలు చూపిస్తూ.. నవ్వులు చిందిస్తూ.. బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. చిన్న పిల్ల‌లా మారిపోయాను అంటూ మెహ‌రీన్ త‌న పిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి తెగ వైర‌ల్‌గా మారాయి. కాగా, రీసెంట్‌గా మెహ‌రీన్ అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి మీ కత్తి మీద ఆధారపడడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకే సొంతంగా ఓ కత్తి ఉంటుంది’అని మెహ్రీన్‌ చెప్పుకొచ్చింది.