Mehreen: తప్పుడు రాతలు రాసే వారికి మెహ్రీన్ మాజీ ప్రియుడి వార్నింగ్

Mehreen: ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎందుకు కలుస్తారో.. ఎందుకు విడిపోతారో అర్థం కాదు. కొందరు కలిసున్న కొన్నేళ్లకు విడిపోవాలని ఫిక్స్ అవుతారు. మరికొందరు మాత్రం కలిసుండక ముందే కలిసుండలేమని ముందుగానే ఫిక్స్ అయిపోయి విడిపోతుంటారు. అలాంటి జాబితాలోకి పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా వస్తుంది. ఈమె హర్యానా మాజీ సీఎం భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకుంది.

Mehreen Ex Lover Bhavya Warns to Netizens
Mehreen Ex Lover Bhavya Warns to Netizens

నేడో రేపో పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్న తరుణంలో ఉన్నట్లుండి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చింది. భవ్యతో తన ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నానని.. ఇక నుంచి అతడి కుటుంబంతో కానీ, అతడితో కానీ ఎలాంటి సంబంధాలు ఉండవని తేల్చేసింది మెహ్రీన్. అయితే ఎందుకు ఈ పెళ్ళి రద్దు అయిందనేది వాళ్లకు మాత్రమే తెలుసు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి తోచిన కారణాలు వాళ్లు రాస్తున్నారు.

ఇదే విషయంపై భవ్య బిష్ణోయ్ సీరియస్ అయ్యాడు. ఈ మొత్తం సీన్ లో అంతా మెహ్రీన్ కే అండగా నిలబడుతున్నారు. ఏదో భారీ కారణం ఉండుంటుంది అందుకే క్యాన్సిల్ చేసుకుంది అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు భవ్య కుటుంబాన్ని తప్పు పడుతూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై భవ్య బిష్ణోయ్‌ సీరియస్ అయ్యాడు. తనపై కానీ.. తన కుటుంబంపై కానీ ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

పెళ్లి ఎందుకు క్యాన్సిల్‌ అయిందో చెప్పాల్సిన అవసరం తనకు లేదని.. అవసరం కూడా లేదని.. చెప్పనంటున్నాడు భవ్య. ఎవరైనా తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు భవ్య. ఇప్పటికే తనపై తప్పుడు కామెంట్స్ చేసిన వాళ్ల అకౌంట్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించాడు భవ్య. కాగా గత మార్చి 13న హీరోయిన్‌ మెహ్రీన్‌, భవ్య బిష్ణోయ్‌ల నిశ్చితార్థం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ విల్లా ప్యాలెస్‌లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య జరిగిన సంగతి తెలిసిందే.