Megha akash: ముద్ద‌మందారంలా క‌నిపిస్తున్న మేఘా ఆకాశ్..క్యూట్ స్మైల్‌కి కుర్ర‌కారు ఫిదా

Megha akash: మేఘా ఆకాశ్‌.. ఈ అమ్మ‌డు పేరుకు తమిళ ఇండస్ట్రీకి చెందిన నట వారసత్వం అయిన తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది .  తొలి సినిమాలోనే మంచి నటనను కనబరిచిన ఈ చిన్నది వరుస ఆవకాశాలు సొంతం చేసుకుంది. నితిన్ నటించిన లై అనే సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ మేఘ ఆకాష్.

TheNewsQube-
megha akash stunning look
megha akash stunning look

లై సినిమా తర్వాత వెంటనే నితిన్‌తో మరో సినిమా చేసింది. చల్ మోహన్ రంగ అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ చిన్నది తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది.

ఇటీవ‌ల శ్రీవిష్ణు నటించిన రాజరాజ చోర అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ చిన్నది. ఇందులో మేఘా ఆకాశ్‌కి మంచి మార్కులే ప‌డ్డాయి. మేఘా ఆకాశ్ న‌టన‌ట‌న‌పై విమ‌ర్శకులు ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక డియ‌ర్ మేఘ అనే సినిమాతోను ఈ అమ్మ‌డు సంద‌డి చేసింది.

megha akash stunning look1
megha akash stunning look1

మేఘా ఆకాశ్ నటించిన సినిమాలు పూర్తి స్థాయిలో ఘన విజయాలను సొంతం చేసుకోకపోయినా, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని మేఘా ఆకాశ్ ముందుకు సాగుతోంది. దాంతో ఇప్పుడామె చేతిలో ఏకంగా మూడు, నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో శివ కందుకూరి నటిస్తున్న ‘మను చరిత్ర’ ఒకటి.

అలానే సత్యదేవ్, తమన్నా నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ మూవీలోనూ మేఘా ఆకాశ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక బైలింగ్వల్ మూవీ ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’లోనూ మేఘా ఆకాశ్ నటిస్తోంది. అక్టోబర్ 26 (నేడు) మేఘా ఆకాశ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘మను చరిత్ర’ సినిమాలోని ‘ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్లా’ అనే పాటను కాజల్ విడుదల చేయబోతోంది.

సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మ‌డు తెగ సంద‌డి చేస్తుంటుంది. క్యూట్ లుక్స్‌తో స్మైల్ ఇస్తూ అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టేలా కొన్ని పిక్స్ షేర్ చేసింది మేఘా. ఇవి నెట్టింట వైర‌ల్‌గా మారాయి.