Megha akash : మెఘా ఆకాష్ మీద రానా హ్యాండ్ పడింది ఈసారైనా లక్ కలిసొస్తుందేమో చూడాలి..!

Megha akash : మెఘా ఆకాష్ టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో గ్రాండ్ గా ఎంటరైంది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిలిగింది. సినిమా కాన్సెప్ట్ బావున్నప్పటికి నితిన్ కి వర్కౌట్ కాలేదు. అదే హీరోయిన్ గా పరిచయం అయిన మేఘా ఆకాష్ కి పెద్ద మైనస్ అయింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. అయితే లక్కీగా నెక్స్ట్ సినిమానే మళ్ళీ నితిన్ తో చేసే ఛాన్స్ అందుకుంది. ఆ సినిమానే ఛల్ మోహన రంగ. కాని అనూహ్యంగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక భారీ డిజాస్టర్ గా మిగిలింది.

megha akash got chance in rana daggubati movie
megha akash got chance in rana daggubati movie

దాంతో ఇక అందరు ఈ బ్యూటీ ని తీసి పక్కన పెట్టారు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట్ట తో తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే అమ్మడికి లక్ కలిసి రాక ఆ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది. అయితే అడపదడపా సినిమాలైతే చేస్తుంది గాని మేఘా ఆకాష్ కి సరైన గుర్తింపు మాత్రం దక్కడం లేదు. కాగా తాజాగా మేఘా ఆకాష్ – అరుణ్ ఆదిత్ – అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో ‘డియర్ మేఘ’ అన్న సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలాకాలానికి మేఘా ఆకాష్ తెలుగులో చేస్తున్న సినిమా.

Megha akash : ‘ రాధే ‘ లో సల్మాన్ ఖాన్ కి జంటగా మెఘా ఆకాష్ ..!

megha akash got chance in rana daggubati movie
megha akash got chance in rana daggubati movie

అయితే తాజాగా ఫస్ట్ లుక్ ను హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో హిట్ అందుకుంటుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ – సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై అర్జున్ దాస్యన్ ఈ సినిమాని నిర్మిస్తుండగా ఎ.సుశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా తో పాటు మేఘా ఆకాష్ యంగ్ హీరో సత్య దేవ్ – తమన్నా భాటియా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ప్రభ్ దేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘ రాధే ‘ అన్న సినిమాలో కూడా నటిస్తోంది.

Advertisement