Chiru-Prabhas: ప్ర‌భాస్‌కి స్పెష‌ల్ విషెస్ అందించిన చిరంజీవి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Chiru -Prabhas ఆర‌డుగుల అందగాడు ప్ర‌భాస్ బ‌ర్త్ డే వేడుక‌లు ఈ రోజు దేశ‌మంత‌టా జ‌రుగుతున్నాయి. అభిమానులు, సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. బాహుబ‌లి లాంటి భారీ హిట్ సాధించి పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ న‌ట‌న‌తోనే కాదు సింప్లిసిటీతో ఎంద‌రో మ‌న‌సుల‌ని గెలుచుకున్నాడు.

ప్ర‌భాస్ చాలా సిగ్గుప‌డుతుంటాడు, మొహ‌మాట ప‌డుతుంటాడు అని అంద‌రూ అనుకుంటుంటారు. కానీ కాస్త‌ ప‌రిచయం ఉన్న‌వాళ్ల ద‌గ్గ‌ర ప్ర‌భాస్ ని చూడండి – చిన్న పిల్లాడిలా మారిపోయి అల్ల‌రి చేస్తుంటాడు. త‌న‌వాళ్లు అనుకున్న వాళ్ల గురించి ఎంత దూర‌మైనా వెళ్తాడు ప్ర‌భాస్‌. మీడియాతో ప్ర‌భాస్ వ్య‌వ‌హ‌రించే తీరు చాలా ముచ్చ‌టగా ఉంటుంది.

చిన్న పేప‌రో, పెద్ద ఛాన‌లో అని ప్ర‌భాస్ ఎప్పుడూ చూడడు. ఎవ‌రు ఎలాంటి ప్ర‌శ్న అడిగినా – చాలా ప్రేమ‌గా స‌మాధానం చెబుతుంటాడు. ఏదైనా కాస్త క‌ష్ట‌పెట్టే ప్ర‌శ్న వ‌స్తే మాత్రం `ఎందుకులే డార్లింగ్ మ‌న‌కు ఇలాంటివి…` అని సున్నితంగా స‌ర్ది చెబుతాడు. ఈ ల‌క్ష‌ణాలు పాత్రికేయుల‌కు బాగా న‌చ్చుతాయి. అందుకే ప్ర‌భాస్ మీద అంద‌రికి అంత ఇష్టం.


సూపర్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ పుట్టిన రోజు సందర్భంగా రాధేశ్యామ్ టీం విషెస్‌ తెలిపింది. ఇంకా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా డార్లింగ్‌కు విషెస్‌ అందిస్తూ ట్వీట్‌ చేసింది. అలాగే వెంకీమామ ఫ్యాన్స్‌ ప్రభాస్‌ స్పెషల్‌ డీపీ విడుదల చేసింది.

టాలీవుడ్‌ హీరోయిన్‌ స్వీటీ అనుష్క కూడా తన రీల్‌ హీరోకి స్పెషల్‌ విషెస్‌ తెలిపింది. అలాగే తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌ పండగ చేసు కుంటున్నారు. దీంతో ప్రత్యేక శుభాకాంక్షలతో సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. ఇక కొద్ది సేప‌టి క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడా ప్ర‌త్యేక విషెస్ అందించారు.

హ్యాపీ బ‌ర్త్ డే ప్ర‌భాస్.. నీకు అంతా మంచే జ‌ర‌గాలి డార్లింగ్ . ఆయురారోగ్యాల‌తో జీవించు అంటూ చిరంజీవి త‌న ట్విట్ లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.