Chiranjeevi : నాకు క్యాన్స‌ర్ వ‌చ్చిందేమో అంటూ .. చిరంజీవి స్ట‌న్నింగ్ కామెంట్స్

Chiranjeevi : అమీర్‌పేటలో యోదా డయోగ్నస్టిక్స్‌‌ సెంటర్‌ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు, తలసాని, చిరంజీవి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి పాల్గొని ప‌లు అంశాల‌పై మాట్లాడారు. త‌న ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ఓ సారి బ్ల‌డ్ శాంపిల్స్ ఇవ్వగా, అందులో క్యాన్ర్ వ‌స్తుందేమోన‌ని చెబుతార‌ని భ‌యం వేసింది అని అన్నాడు.

Megastar Chiranjeevi Shares SH0CKING Incident About His Health
Megastar Chiranjeevi Shares SH0CKING Incident About His Health

కాని వాళ్లు చాలా జాగ్ర‌త్త‌గా ఇలాంటి విష‌యాల‌పై స్పందిస్తారు. ప్ర‌మాదం ఏమి లేదు అంటూ చెప్ప‌డంతో మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉంద‌ని పేర్కొన్నాడు. ఇక వెంకయ్య నాయుడుని భారత రాష్ట్రపతి అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి పదవిలో వెంకయ్యనాయుడిని చూడాలని ప్రతి ఒక్క తెలుగుబిడ్డ కోరుకుంటున్నాడని పేర్కొన్నారు.

‘అయ్యప్ప స్వామి సాక్షిగా వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన దేశానికి చాలా సేవ చేశారు’ అని చిరంజీవి అన్నారు. అమీర్‌పేటలో యోదా డయోగ్నస్టిక్స్‌‌ సెంటర్‌ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.

అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. చిరంజీవి కామెంట్స్‌పై స్పందించారు. తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని ఎవరూ ప్రతిపాదించలేదన్నారు. అయితే.. అందరి మనసులో ఉన్న విషయమే చిరంజీవి చెప్పారన్నారు వెంకయ్యనాయుడు. ఇదే సమయంలో రాజకీయాలపైనా కీలక కామెంట్స్‌ చేశారు వెంకయ్యనాయుడు. రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందన్నారు. చిరంజీవి రాజకీయాలు మానుకొని మంచి పనిచేశారంటూ కితాబిచ్చారు.

వచ్చే ఏడాది భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని చిరంజీవి అభిలషించారు. అయితే, ‘గుర్రం ఎగురావచ్చు’ అన్నట్లుగా.. నిజంగానే వెంకయ్య నాయుడు రాష్ట్రపతి నియామకం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని విశ్లేషకులు అంటున్నారు.