Megastar Chiranjeevi : బాలకృష్ణ తో కలిసి మందు కొట్టేవాడిని.. చిరంజీవి అలయ్‌ బలయ్‌ ముచ్చట్లు

NQ Staff - October 7, 2022 / 03:39 PM IST

Megastar Chiranjeevi  : బాలకృష్ణ తో కలిసి మందు కొట్టేవాడిని.. చిరంజీవి అలయ్‌ బలయ్‌ ముచ్చట్లు

Megastar Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి తాజాగా బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ఒకప్పటి సీనియర్ హీరోల అభిమానులు కొట్టుకునే వారని, ఒకరి పోస్టర్లపై ఒకరు పేడ నీళ్లు చల్లుకునే వారు.

దాంతో హీరోల మధ్య సఖ్యత ఉండేది కాదని తెలియజేశాడు. అయితే 1980, 90 హీరోలమైన మేము ఒక మంచి వాతావరణం ఉండాలి అనే ఉద్దేశంతో ఏ చిన్న సినిమా కార్యక్రమం జరిగిన కూడా అందరం ఆహ్వానించుకునే వాళ్లమని ప్రతి ఒక్కరం కూడా కలుసుకునే వాళ్ళమని చిరంజీవి తెలియజేశాడు.

ఎన్నో సందర్భాల్లో మేము కలిశామని ఆ సందర్భాలు అన్నీ కూడా మధురానుభూతులుగా ఉంటాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాత్రి కలిసి మందు తాగిన తర్వాత మరింత స్నేహపూర్వక వాతావరణం ఉండేది అంటూ సరదాగా చిరంజీవి వ్యాఖ్యలు చేశాడు.

బాలకృష్ణ, నాగార్జున తో పాటు ఇంకా ఎంతో మంది తన తోటి హీరోలు కార్యక్రమాలకు హాజరయ్యే వాళ్ళమని ఒకరినొకరం అభినందించుకుంటూ పార్టీలు ఇచ్చుకుంటూ సరదాగా ఉండే వాళ్లమని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికి కూడా ఆ వాతావరణం ఉందని అలాంటి వాతావరణం ఉంటేనే అన్ని విధాలుగా బాగుంటుందని, అలాగే అలయ్ బలయ్‌ కార్యక్రమం కి వచ్చినందుకు సంతోషంగా ఉందంటూ చిరంజీవి పేర్కొన్నాడు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us