‘Mega’ News : పవన్ ని ఎత్తుకున్న చిరు.. నాగబాబుపై చెయ్యేసిన పవర్ స్టార్..

‘Mega’ News: చిరంజీవి మెగాస్టార్ మాత్రమే కాదు. ఎవ్వర్ గ్రీన్ స్టార్ కూడా. సోషల్ మీడియాలో సైతం తిరుగులేని సుప్రీం హీరో అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అన్నదమ్ముల అనుబంధానికి అసలు సిసలు చిరునామా కొణిదెల కుటుంబం అని పేర్కొంటున్నారు. ఇవాళ తేదీ మే 24. సోమవారం. ఈరోజు ‘ఇంటర్నేషనల్ బ్రదర్స్ డే’ అట. ఈ సందర్భంగా చిరంజీవి తమ ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించిన ఒక అరుదైన, చిన్ననాటి ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందుకే అభిమానులు తమ బిగ్ బాస్ గురించి నేడు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.

‘Mega’ News

ఇద్దరన్నల ముద్దుల తమ్ముడు

ఈ ఇంట్రస్టింగ్ ఇమేజ్ లో లిటిల్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరన్నల ముద్దుల తమ్ముడిలా చిరంజీవి, నాగబాబు మధ్యలో స్టైలిష్ గా పోజిచ్చాడు. బుల్లి పవన్ కళ్యాణ్ ని చిరంజీవి ఎంతో ప్రేమతో ఎత్తుకోగా పవర్ స్టార్ మాత్రం దర్జాగా తన చిన్నన్న నాగబాబు భుజం మీద చెయ్యేసి నిలుచున్నాడు. ఈ పిక్చర్ లో నిజంగా వాళ్లు ‘ముగ్గురూ ముగ్గురే’ అన్నట్లు కనిపిస్తున్నారు. ఇంట్లో పెద్దోడి పైనే ఎక్కువ బాధ్యతలు ఉంటాయని అంటారు. దానికి నిదర్శనంగా మెగాస్టార్ తన చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఎత్తుకొని నిలబడటం గమనార్హం.

‘Mega’ News

తోడబుట్టిన.. రక్తం పంచిన..

ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోకి చిరంజీవి ఒక చక్కని క్యాప్షన్ కూడా పెట్టారు. ‘తోడ బుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్(ఫ్యాన్స్)కి హ్యాపీ బ్రదర్స్ డే అంటూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ పోస్టుకి కొద్దిసేపట్లోనే వేల సంఖ్యలో లైకులు, రీట్వీట్లు వచ్చాయి. అభిమానులు కూడా ఆ ముగ్గురు ఆదర్శవంతమైన అన్నదమ్ములకు అంతే ఆప్యాయంగా విషెష్ చెప్పారు. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక స్పెషల్ ట్వీట్ పెడుతున్న చిరంజీవి ఇవాళ అన్నదమ్ముల సెంటిమెంటుకి అద్దం పట్టారు. సొసైటీలోని ఎంతో మంది బ్రదర్స్ హార్ట్ టచ్ చేశారు అని పలువురు మెచ్చుకుంటున్నారు.