Chiranjeevi: అమెరికాలో తప్పిపోయిన చిరంజీవి.. ఈ విష‌యం మీకెవ‌రికైన తెలుసా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏంటి.. అమెరికాలో తప్పిపోవడం ఏంటి..? అమెరికా ఆయనకు కొత్త కాదు కదా అనుకుంటున్నారా..? మీరు అనుకున్నది కరెక్టే.. కానీ ఇది జరిగి 30 సంవత్సరాలు దాటిపోయింది. అసలు విషయం ఏంటంటే.. 1988.. సుప్రీం హీరో స్థాయినుంచి మెగాస్టార్ గా అప్పుడప్పుడు చిరంజీవి అడుగులు వేస్తున్న సమయం అది. ఒక్క క్షణం కూడా చిరంజీవి ఖాళీగా లేడు ఆ రోజుల్లో. లెక్కకు మించి సినిమాలు చేస్తూ ఒళ్ళు హూనం చేసుకుంటున్నారు.

Chiranjeevi

ఒక్కరోజు ఖాళీ దొరికితే అదే మహా ప్రసాదం అనుకుంటున్న రోజులు. అలాంటి సమయంలో కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలని చిరంజీవి అనుకున్నారు. అయితే ఇండియాలో ఉంటే కచ్చితంగా ఎవరో ఒక నిర్మాత వచ్చి ఇబ్బంది పెడతాడు. మొహమాటంతో సినిమా చేయాల్సి వస్తుంది. అందుకే విదేశాలకు వెళ్దామని చిరంజీవి ఆలోచించాడు. తన ఆలోచన చెప్పిన వెంటనే నిర్మాత కె.ఎస్.రామారావు అమెరికా సూచించాడు.

Chiranjeevi

దాంతో చిరంజీవి, కె.ఎస్.రామారావు దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు కూడా అమెరికా వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లే ముందే చిరంజీవి ఒక కండిషన్ పెట్టారు. అమెరికాలో తామంతా సెలబ్రిటీల మాదిరి కాకుండా సాధారణ వ్యక్తుల్లా ఉండాలని కండిషన్ పెట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లలో కాకుండా పబ్లిక్ వెహికల్స్ లో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా ఎక్కడికి వెళ్ళినా చాలా దూరం నడిచి వెళ్లారు. అలాంటి సమయంలో ఒక ఏసీ బస్సులో అందరూ ప్రయాణం చేశారు.

Chiranjeevi

తాము దిగాల్సిన చోటు వచ్చేసింది. తర్వాత అందరూ దిగారు.. ఒక చిరంజీవి తప్ప. దాంతో కెఎస్ రామారావు, అల్లు అరవింద్ తో పాటు అందరూ కంగారు పడుతూ ఉంటే.. రెండు స్టేషన్ల తర్వాత హాయిగా నవ్వుతూ నడుస్తూ కనిపించారు. ఈ సంఘటన అంతా ఈ మధ్య సోషల్ మీడియాలో చిరు అభిమానులు కొందరు పోస్ట్ చేశారు. ఏదేమైనా ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ప్ర‌స్తుతం చిరంజీవి పేద ప్ర‌జ‌ల‌కు ఎంతో అండ‌గా ఉంటూ అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఆక్సిజ‌న్ బ్యాంక్‌ల‌ని ఇప్ప‌టికే ప్రారంభించిన చిరు త్వ‌ర‌లో అంబులెన్స్ స‌ర్వీస్ కూడా మొద‌లు పెడ‌తార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత లూసిఫ‌ర్, వేదాళం రీమేక్ చిత్రాల‌లో న‌టించ‌నున్నాడు.