Chiranjeevi: అభిమానికి ప్ర‌త్యేక ఫైట్ టిక్కెట్స్ పంపి ఇంటికి పిలిపించుకున్న చిరు..!

Chiranjeevi మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క హీరోగానే కాకుండా మంచి మంచి మాన‌వ‌తా వాదిగా కూడా చిరు అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు. ఎన్నో సాయాలు చేసిన చిరు తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అభిమాని.. తనను కలవాలని కోరగా.. ప్లైట్ టికెట్ బుక్ చేసి మరీ ఇంటికి పిలిపించుకున్నారు.

మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విటర్‌ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. ‘నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను’ అని ట్విటర్ వేదికగా చిరంజీవి వెంకట్ అభ్యర్థించారు.

వెంట‌నే స్పందించిన చిరంజీవి ఎలా అయినా వెంకట్ ను కలవాలని భావించి వెంకట్, వెంకట్ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ తీయించి హైదరాబాద్ రప్పించారు. శనివారం నాడు చిరంజీవి.. వెంకట్ ఆయన భార్య సుజాతను తన నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపారు చిరంజీవి.

వెంక‌ట్‌కి మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఓ ప్రైవేట్‌ హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చులు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అని అన్నారు.

తన వీరాభిమాని వెంకట్ ను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకట్, ఆయన భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు అందరూ మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరోసారి ప్రూవ్ అయింది అని చెబుతున్నారు.