Megastar Chiranjeevi : పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు: మెగాస్టార్ చిరంజీవి ధీమా.!

NQ Staff - October 4, 2022 / 03:59 PM IST

Megastar Chiranjeevi : పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు: మెగాస్టార్ చిరంజీవి ధీమా.!

Megastar Chiranjeevi :  ‘ప్రస్తుత సమాజానికి నిబద్ధత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి. అలా నాయకుడు కావాలి..’ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘గాడ్ ఫాదర్’ సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాని తెలుగులోకి ‘గాడ్ ఫాదర్’ పేరుతో తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ టీమ్ మీడియా ముందుకొచ్చింది. ఈ మీడియా మీట్ సందర్భంగా చిరంజీవి ముందు కొన్ని రాజకీయ పరమైన అంశాలూ ప్రశ్నల రూపంలో వచ్చాయి. దాంతో, చిరంజీవి రాజకీయాలపైనా స్పందించక తప్పలేదు.

తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి ఫుల్ సపోర్ట్..

నా తమ్ముడు, నా బిడ్డ.. అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడమే కాదు, ‘పవన్ కళ్యాణ్ నిబద్ధత ఏంటో నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఎటువైపు వుండాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి.. మంచి పరిపాలన అందించాలి.. అందుకు నా సహకారం ఎప్పుడూ వుంటుంది..’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

‘నేను రాజకీయాల్ని వదిలేసి, సినిమాల్లో వుండటమే పవన్ కళ్యాణ్‌కి మంచిదేమో.. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా మద్దతిస్తానేమో..’ అని చిరంజీవి వ్యాఖ్యానించడం మరో ఆసక్తికరమైన అంశం.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కుతున్న ప్రస్తుత తరుణంలో పొలిటికల్ థ్రిల్లర్ ‘గాడ్ ఫాదర్’ ఎలాంటి రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుందో వేచి చూడాల్సిందే.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us