Chiru-Bunny: బ‌న్నీతో మెగాస్టార్ స్టెప్పులు.. ఇది జ‌రిగితే తెర చిన‌గ‌డం ఖాయం..!

Chiru-Bunny సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న కొన్ని ప్ర‌చారాలు చూస్తుంటే అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా చేస్తున్నాయి. ఇలాంటివి నిజంగా జ‌రిగితే బాగుండు క‌దా అని అభిమానులు కోరుకుంటున్నారు. అలా అభిమానులు ఆనందాన్నిరెట్టింపు చేసే ఓ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అది నిజం అయితే థియేటర్స్ లో రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.

Chiranjeevi & Allu Arjun

మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్న‌త స్థాయికి ఎదిగాడు. ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్‌గా పిలిపించుకుంటున్న బ‌న్నీ రానున్న‌రోజుల‌లో ఐకాన్ స్టార్‌గా మార‌నున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కుతుంది. మొదట్లో ఈ చిత్రాన్ని ఒకే పార్ట్‌లో రూపొందించి, విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రెండు పార్ట్‌‌లుగా రూపొందిస్తున్నట్లుగా విడుద‌ల కానుంద‌ని ఇటీవ‌ల‌ అధికారికంగా ప్రకటించారు. అయితే ‘పుష్ప’ రెండు పార్ట్‌లకు సంబంధించిన బౌండెడ్ స్ర్కిప్ట్‌ని సుకుమార్ ముందుగానే రెడీ చేశారని తెలుస్తోంది.

పుష్ప చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కించాల‌ని సుకుమార్ ముందే అనుకున్నాడ‌ట‌. అందుకే రెండు పార్ట్‌లకు అనుగుణంగా బౌండెడ్ స్ర్కిప్ట్‌ని ఆయన రెడీ చేసి పెట్టుకున్నారట. మొదటి పార్ట్‌కి సంబంధించిన చిత్రీకరణను దాదాపు పూర్తి చేసిన సుకుమార్.. ప్రస్తుతం ఎడిటింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

పుష్ప కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటున్నట్లుగా సమాచారం.ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇప్పటికే విడుదల చేసిన “ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్” వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. మ‌రోవైపు మూవీకి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌లో అంచ‌నాల‌ను భారీగా పెంచుతున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారట. స్పెషల్ సాంగ్‏లో చిరు ఇలా వచ్చి వెళ్లిపోతారని అంటున్నారు. గ‌తంలో చిరంజీవి, అల్లు అర్జున్‌లు క‌లిసి డాడీ సినిమాలో న‌ర్తించారు. ఆ ఫ్రేమ్ ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో న‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ బ‌న్నీ, చిరు క‌లిసి పుష్ప చిత్రంలో నాట్యం చేస్తే థియేట‌ర్స్ ద‌ద్ద‌రిల్ల‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.