PV Sindhu: చిరు ఇంట్లో పీవీ సింధుకి స‌త్కారం.. బిడ్డ అనే భావ‌న క‌లిగింద‌ని కామెంట్

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. ఈ క్ర‌మంలో ఆమెకు అభినంద‌న‌లు, ప్ర‌శంస‌లు, స‌త్కారాలు జ‌రుగుతున్నాయి. ఈ నెల 20న చిరంజీవి త‌న ఇంట్లో ప్ర‌ముఖుల మ‌ధ్య పీవీ సింధుని స‌త్క‌రించారు.ఈ వేడుక‌కి హీరోలు కింగ్‌ నాగార్జున, అల్లు అరవింద్‌, రానా, రామ్‌ చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, శర్వానంద్‌, అఖిల్‌, వ‌రుణ్ తేజ్ పలువురు హీరోలతో పాటు హీరోయిన్లు సుహాసిని, రాధిక శరత్‌ కుమార్‌ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


Megastar Chiranjeevi Hosts A Grand Party To Felicitate PV Sindhu In Hyderabad
Megastar Chiranjeevi Hosts A Grand Party To Felicitate PV Sindhu In Hyderabad


సినీ ప్రముఖుల మధ్య మెగాస్టార్‌, అల్లు అరవింద్‌ తదితరులు సింధును సత్కరించి అనంతరం ఆమె సాధించిన మెడల్‌తో వారంతా ఫొటోలు దిగారు. సింధును చూసి దేశం మురిసిపోతుంటే తన బిడ్డే అనే భావన కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటానన్న సింధు.. వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. సింధు సాధించిన కాంస్య పతకంతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ సందడిగా గడిపారు.


Megastar Chiranjeevi Hosts A Grand Party To Felicitate PV Sindhu In Hyderabad
Megastar Chiranjeevi Hosts A Grand Party To Felicitate PV Sindhu In Hyderabad


ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సామాజిక వేదిక ద్వారా మెగా అభిమానులతో పంచుకున్నారు.ఈ వీడియో ఆక‌ట్ట‌కునేలా ఉంది.అయితే వేడుకకు సంబంధించిన పిక్స్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. పీవీ సింధును పొగుడుతూ ఆమెతో దిగిన ఫొటోల‌ని షేర్ చేస్తూ.. రాధిక ట్వీట్ చేశారు. అయితే, పీవీ సింధు గెలిచింది స్వర్ణం పతకం అంటూ రాధిక ట్వీట్ చేశారు. ‘పసిడి పతకం గెలుచుకోవడం ఎంత గొప్ప అనుభూతి! దేశం కోసం పోరాడి పతకం సాధించింది’ అంటూ రాధిక తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఒలింపిక్ గోల్డ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.

కాంస్య ప‌త‌కం గెలిస్తే బంగారు ప‌త‌కం అని రాధికా కామెంట్ చేసినందుకు నెటిజ‌న్స్ ఆమెపై ట్రోల్స్ కూడా చేశారు. అయితే ఆ కాంస్య పతకమే బంగారు పతకం కంటే గొప్పది.. పీవీ సింధులోని ఆ ఫీలింగ్స్, ఆమె సంతోషమే అది తెలియజేస్తోంది అని ట్రోలర్లకు సమాధానం ఇచ్చారు.