Megastar Chiranjeevi: ఆచార్యగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు స్పెషల్ @66
Samsthi 2210 - September 3, 2021 / 02:07 PM IST

Megastar Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషి, పట్టుదలే మార్గాలుగా మార్చుకుని తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తిత్వం ఆయనది. చిరంజీవి పుట్టినరోజుకి ఆయన అభిమానులు ఇవ్వబోయే ట్రీట్, గ్రీటింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. మెగాస్టార్ పుట్టినరోజు అంటేనే అభిమానులకు ఓ పండగలాంటిది.

Megastar Chiranjeevi 66 Birthday Special Article
ఎంత కాలం అయినా, ఎన్ని తరాలు మారినా మెగా పవర్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. మెగాస్టార్ గా ఉన్నతమైన స్థానాన్ని ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరంగా కాపాడుకుంటున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలోనే మెగా స్టార్ కి మంచి బ్రాండ్ ఉంది. ఆయన పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో, అంతులేని భావోద్వేగాలతో ఎవర్నైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆయన నటనకు, సమాజసేవకు పద్మ భూషణ్ వరించింది. తెలుగు అమితాబచ్చన్ గా ఎదిగారు.

Megastar Chiranjeevi 66 Birthday Special Article
దాదాపు 42 సంవత్సరాల తన సినీ ప్రస్థానంలో ఎన్నో వినూత్నమైన కథలతో.. విలక్షణమైన పాత్రలతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. చిరంజీవి హీరోగా థియేటర్ లో విడుదలైన సినిమా ప్రాణం ఖరీదు. కానీ నటించిన సినిమా మాత్రం పునాది రాళ్ళు. అలా ప్రాణం ఖరీదు సినిమా నుండి ఇప్పటి ఆచార్య వరకు చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ పాత్రల్ని ఎంతో చాకచక్యంగా పోషించిన నటుడు. ఒక్కసారిగా ఖైదీ సినిమాతో స్టార్ డమ్ ని సంపాదించుకున్నారు.

Megastar Chiranjeevi 66 Birthday Special Article
ఎలాంటి పాత్రల్లో అయినా అవలీలగా నటించి మెప్పించిన హీరోగా చిరంజీవి ఎదిగారు. రుద్రవీణ లాంటి సినిమాల్లో నటించి సమాజం పట్ల ఆయనకున్న సామాజిక స్పృహను తెలియజేశారు. చంటబ్బాయి లాంటి కామెడీ యాంగిల్ ని పరిచయం చేశారు. అలా అన్ని రకాల జోనర్స్ లో తన ప్రతిభను చాటుకున్నారు. చిరంజీవి పేరిట ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ ని నిర్వహించి ఎంతోమంది అభాగ్యులకు బాసటగా నిలిచిన మహనీయుడు. రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకున్నారు. ఖైదీ నం 150 తో రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుకున్నారు.
చిరంజీవి మొట్ట మొదటిసారిగా చారిత్రాత్మక సినిమా అయిన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించారు. అతి త్వరలో ఆచార్య సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. అందులోనూ ఆయన తనయుడు రామ్ చరణ్ తో కలిసి పూర్తి మల్టీ స్టారర్ గా తెరకెక్కబోతున్న సినిమా. చిరంజీవి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని 66 వ వసంతంలోకి అడుగుపెడుతున్న మెగాస్టార్ చిరంజీవి అలియాస్ శివ శంకర వర ప్రసాద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.