Mega war: మెగా ఫైట్.. కొద్ది రోజుల వ్య‌వ‌ధిలో త‌ల‌ప‌డుతున్న మెగా హీరోలు

Mega war: క‌రోనా త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్స్‌లో సంద‌డి క‌నిపిస్తుంది. థియేట‌ర్స్‌కి పూర్వ వైభ‌వం వ‌చ్చిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. టాలీవుడ్ కళకళలాడుతోంది. కొత్త సినిమా సింగిల్స్, టీజర్స్, ట్రైలర్స్ తో సందడి చేస్తోంది. ఇండియన్ సినిమాల్లో ఏ ఇండస్ట్రీలోనూ ఇంత రచ్చ జరగట్లేదంటే అది నిజం. దీనికి కారణమైన తెలుగు ఆడియెన్స్ ను మిగిలిన ఇండస్ట్రీ వాళ్లు తెగ పొగిడేస్తున్నారు.

mega heros are ready for fight1
mega heros are ready for fight1

ఇక డిసెంబ‌ర్ నుండి మెగా హీరోల సంద‌డి ఓ రేంజ్‌లో ఉండ‌నుంది. తెలుగు చిత్రసీమలో దాదాపు డజను మంది మెగా హీరోలు ఉన్నారు. వారిలో న‌లుగురు సినిమాలు అతి త‌క్కువ గ్యాప్‌లో విడుద‌ల కాబోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా నలుగురు మెగా హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. డిసెంబర్ 17న పాన్-ఇండియన్ విడుదలకు సిద్ధమవుతున్న అల్లు అర్జున్ పుష్పతో సీజన్ ప్రారంభమవుతుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా గ‌నీ డిసెంబర్ 24న క్రిస్మస్ సీజన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన దేశంలోనే అతిపెద్ద చలన చిత్రం ఆర్ఆర్ఆర్ జనవరి 7, 2022న ప్రపంచవ్యాప్తంగా 10,000 స్క్రీన్‌లలో విడుదల కానుంది.

భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. . పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమ్లా నాయక్ జనవరి 12, 2022న విడుదలవుతుందని ప్రకటించారు.ఆర్ఆర్ఆర్ విడుదలైన 5 రోజుల తర్వాత భీమ్లా నాయక్ విడుదల కాబోతుండ‌డం చాలా ఆశ్చర్యకరమైన విషయం.

mega heros are ready for fight2
mega heros are ready for fight2

మొత్తమ్మీద షార్ట్ గ్యాప్‌లో నాలుగు మెగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి, ఇది మెగా అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు ట్రీట్ అనే చెప్పాలి. బాలకృష్ణ అఖండ, నాని శ్యామ్ సింగరాయ్ మరియు ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రాలు కూడా ఈ గ్యాప్‌లో రాబోతున్నాయి.