Mega Star Chiranjeevi : వీరయ్య అప్పుడే శంకర్ గా మారాడు!

NQ Staff - January 20, 2023 / 06:56 AM IST

Mega Star Chiranjeevi  : వీరయ్య అప్పుడే శంకర్ గా మారాడు!

Mega Star Chiranjeevi  : సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఆ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగానే మరో సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా చిత్రీకరణలో నేటి నుండి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్న చిరంజీవికి భోళా శంకర్ చిత్ర యూనిట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ భోళా శంకర్ చిత్రీకరణ పునః ప్రారంభించారు.

Mega Star Chiranjeevi Will Participate Shooting Of Bhola Shankar

Mega Star Chiranjeevi Will Participate Shooting Of Bhola Shankar

వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ బోళా శంకర్ సినిమా ఇప్పటి వరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయిందని, త్వరలోనే చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నారు. అన్నట్లుగానే ఈ నెలలోనే రెండు వారాల పాటు భోళా శంకర్ చిత్రీకరణలో చిరంజీవి పాల్గొనబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

Mega Star Chiranjeevi Will Participate Shooting Of Bhola Shankar

Mega Star Chiranjeevi Will Participate Shooting Of Bhola Shankar

మెగాస్టార్ చిరంజీవి కి సోదరి పాత్రలో కీర్తి సురేష్ ఈ సినిమాలో కనిపించ బోతోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇదే ఏడాది విడుదల అయ్యేలా దర్శకుడు మెహర్ రమేష్ ప్లాన్ చేస్తున్నాడు. అతి త్వరలోనే విడుదల తేదీ పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us