Mega Star Chiranjeevi : చిరంజీవి వల్లే శ్రీజ రెండుసార్లు విడాకులు తీసుకుందా.. సంచలన నిజం ఇదే..!
NQ Staff - February 16, 2023 / 01:45 PM IST

Mega Star Chiranjeevi : చిరంజీవి ఎంత సౌమ్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ విషయంలో అయినా సరే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటారు. ఇక తన కుటుంబ సభ్యుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. వారు బాధ పడితే అస్సలు తట్టుకోలేరు చిరంజీవి. తన ముగ్గురు పిల్లలను ఎంతో గారాబంగా పెంచుకున్నారు చిరంజీవి.
ముఖ్యంగా తన చిన్న కూతురు శ్రీజను చాలా అపురూపంగా పెంచుకున్నాడు. అందుకే ఆమె ఏ విషయంలో అయినా సరే చాలా కచ్చితంగా అన్నట్టే వ్యవహరిస్తుందంట. చిన్నప్పటి నుంచి శ్రీజ ఏది అడిగితే అది ఇచ్చేవాడు చిరంజీవి. దాంతో ఆమె కోరుకున్నది సాధించాలనే కండీషన్లు పెట్టుకునేది.
భర్తకు కండీషన్లు..
ఈ కారణంగానే ఆమె కోరుకున్న వ్యక్తితో ఇంట్లో నుంచి పారిపోయి పెండ్లి చేసుకుంది. కానీ శ్రీజకు కష్టపడటం అంటే అస్సలు నచ్చదు. తను కోరుకున్నది జరగాలి అనే మనస్తత్వాన్ని చిన్నప్పటి నుంచి చిరంజీవి అలవాటు చేశాడు. దాంతో ఆమె కూడా అలాంటి కండీషన్లు భర్తకు పెట్టేయడంతో అతను ఆమెను భరించలేకపోయాడు.
దాంతో ఇద్దరికీ విడాకులు అయ్యాయి. ఆ తర్వాత చిరంజీవి వద్దకు వచ్చేయడంతో ఆయన కల్యాణ్ దేవ్ తో పెండ్లి చేశాడు. ఇక కల్యాణ్ దేవ్ తో కూడా ఓ కూతురు పుట్టిన తర్వాత విడిపోయింది. దీనికి కూడా శ్రీజ మనస్తత్వమే అని తెలుస్తోంది. ఏది తప్పో, ఏది రైటో తెలుసుకోలేని మనస్తత్వం ఆమెది. అందుకే ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుని భర్తలకు దూరంగా ఉంటుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్.