Mega Star Chiranjeevi : వెండితెర వీరయ్య.. రీమేకులు మానవానయ్యా.. మరో తమిళ రీమేకుతో రెడీ అయిన చిరు?
NQ Staff - January 19, 2023 / 01:05 PM IST

Mega Star Chiranjeevi : సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచిన వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించి వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు చిరు. చాలాకాలం తర్వాత స్ట్రెయిట్ చిత్రంతో సక్సెస్ దక్కిందో లేదో మళ్లీ రీమేకులపై ఫోకస్ పెట్టాడు మెగాస్టార్. మళయాళం మూవీ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ పెద్ద సక్సెసయితే సాధించలేదు.
ఇక వేదాళం మూవీకి రీమేక్ గా అనౌన్సయిన భోళా శంకర్ ఇంకా సెట్స్ పైనే ఉంది. షూటింగ్ స్టార్టయ్యి నెలలైనా ఇంకా ఫైనల్ షెడ్యూలుకి చాలా టైమ్ పట్టేలా ఉంది. అయినా చిరు విశ్వాసం అనే తమిళ మూవీ రీమేక్ చేసే ప్లానులో ఉన్నాడట. వి.వి. వినాయక్ డైరెక్టర్ గా ఈ రీమేక్ రానుందనేది లేటెస్ట్ టాక్.
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీకి కూడా వినాయకే డైరెక్టర్. కోలీవుడ్ మూవీ కత్తి కి రీమేక్ గా వచ్చిన ఆ మూవీ టాలీవుడ్లోనూ మంచి హిట్ నే సాధించింది. గతంలో వినాయక్ డైరెక్షన్లో చిరు హీరోగా నటించిన ఠాగూర్ మూవీ కూడా రమణ అనే తమిళ చిత్ర రీమేకే. ఇప్పుడిది కూడా వర్కవుటయితే వీళ్లిద్దరి కాంబినేషన్లో రానున్న మూడో చిత్రమిది.
అయినా పక్కభాషలో హిట్టయిన సినిమాని ఇక్కడ రీమేక్ చేయడం వరకూ ఓకే. కానీ ఆల్రెడీ తెలుగు వెర్షన్ డబ్ అయి థియేటర్లోనూ రిలీజై, టీవీల్లోనూ పదులసార్లు టెలికాస్ట్ అయిన సినిమాను రీమేకేంటి? ఇదెక్కడి లాజిక్? అంటూ మెగా ఫ్యాన్సే పరేషాన్ అవుతున్నారు.
కొత్త కథ, సరికొత్త స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులున్న స్ట్రెయిట్ సినిమాలు చూడడానికే జనాలు పెద్దగా ఇంట్రస్ట్ చూయించని పరిస్థితుంది ప్రస్తుతం. ఓటీటీల్లో ఒరిజనల్ వెర్షన్ ని ఆల్రెడీ చూసేసుండడం, లేని ఎలివేషన్లని జోడించడంతో గాడ్ ఫాదర్ మూవీ తేడా కొట్టేసింది.

Mega Star Chiranjeevi Planning To Remake Tamil Movie Vishavasam
అలాంటిది టీవీల్లోనూ చూసేసిన డబ్బింగ్ సినిమాకి రీమేకంటే కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువే. సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్.. ఇలా వరుసగా భారీ హిట్టవని సినిమాలతో బాధపడుతున్న టైమ్ లో వాల్తేరు వీరయ్య మూవీతో బంపర్ హిట్ కొట్టాడు చిరు. రాక రాక సక్సెస్ వచ్చిందని మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంలో ఉంటే.. ఇప్పుడీ భోళా శంకర్, వెంటనే మళ్లీ విశ్వాసం రీమేకంటూ ఎక్స్ పెరిమెంట్ల టాక్ రావడం అభిమానుల్ని కాస్త కంగారు పెట్టించే విషయమే.
ఇక ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేకుతో బిజీగా ఉన్నాడు వినాయక్. చిరు భోళాశంకర్ షూట్ లో ఉన్నాడు. వీళ్లిద్దరి ప్రస్తుత ప్రాజెక్టులు ఫినిషయితే ఈ రీమేక్ పట్టాలెక్కే ఛాన్సులున్నాయట. మరి సోషల్మీడియాలో వైరలవుతున్నట్టు నిజంగానే విశ్వాసం రీమేకుకి చిరు ఓకే చెప్తాడా? లేక సక్సెసయే ఛాన్సులున్న ఈక్వేషన్స్ ఆలోచించి లైట్ తీసుకుంటాడా? అనేది చూడాలి మరి.