Mega Star Chiranjeevi : మెగా హీరోల కన్నా చిరుకు ఎక్కువగా నచ్చే స్టార్ హీరో అతనే..!
NQ Staff - January 19, 2023 / 11:34 AM IST

Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న పెద్ద హీరో. తన తర్వాత వచ్చే వారికి మెగా బేస్‌ను ఏర్పాటు చేశాడు చిరంజీవి. కాగా చిరంజీవిన ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. ఇక మెగా ట్యాగ్ లైన్‌ను వేసుకుని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారు కూడా చాలామందే ఉన్నారు.
చిరు తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది వచ్చారు. అందులో పవన్ కల్యాన్, బన్నీ, రామ్ చరణ్‌లు స్టార్ హీరోలుగా ఎదిగి చూపించారు. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి వారు టైర్-2 హీరోలుగా ఉన్నారు. అయితే ఇంతమంది మెగా హీరోలు ఉన్నా కూడా చిరంజీవికి మాత్రం వేరే స్టార్ హీరో అంటే చాలా ఇష్టమంట.
సరైన పాత్ర పడితే..

Mega Star Chiranjeevi Likes Jr NTR Very Much
ఆయన ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ గా పాపులర్ అయిన తారక్. తారక్ నటన అన్నా, డ్యాన్స్ అన్నా సరే చిరుకు అమితమైన ఇష్టమంట. ఎన్టీఆర్ కు మంచి పాత్ర పడితే ఎలా రెచ్చిపోయి నటిస్తాడో అందరికీ తెలిసిందే. చాలా సినిమాలు ఆయన నటన కారణంగానే హిట్ అయ్యాయి.
అందుకే చిరంజీవికి ఎన్టీఆర్ డ్యాన్స్ అన్నా, ఆయన కష్టపడే విధానం అన్నా సరే చాలా ఇష్టం. కాబట్టి ఎన్టీఆర్ సినిమా వస్తే కచ్చితంగా చిరు చూసి ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి అభినందిస్తాడంట. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పోటా పోటీగా నటించినా ఎన్టీఆర్ నటన తనకు బాగా నచ్చిందని ఓపెన్ గానే చెప్పేశాడు చిరంజీవి.