Mega Star Chiranjeevi : ఆ హీరోయిన్ తో చిరంజీవి ప్రేమాయణం.. పోలీసుల వరకు వెళ్లిన ఇష్యూ..!
NQ Staff - January 30, 2023 / 05:30 PM IST

Mega Star Chiranjeevi : చిరంజీవి అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి మెగా ప్రపంచాన్ని సృష్టించాడు. తిరుగులేని హీరోగా ఎదిగాడు. ఎవరి ఊహలకు అందనంత ఎత్తులో నిలబడ్డ చిరంజీవి వ్యక్తిగతంగా కూడా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నాడు. కాగా ఆయన సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో ఆడిపాడాడు. కానీ ఎవరితోనూ పెద్దగా రాసుకుని, పూసుకుని తిరగలేదు.
అది ఆయన నైజం. చిరంజీవి జీవితం అంటే తెరిచిన పుస్తకం అని అంతా చెబుతుంటారు. ఎందుకంటే ఆయన జీవితంలో ఎలాంటి మచ్చ లేదు. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం చిరంజీవి ఇబ్బంది పడ్డారు. ఓ హీరోయిన్ తో ఆయన ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెండ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. ఆమె కోసం భార్య సురేఖకు విడాకులు ఇవ్వనున్నాడని అప్పట్లో జోరుగా రూమర్లు వచ్చాయి.
సీరియస్ గా రియాక్ట్..

Mega Star Chiranjeevi Had Love Affair with Sumalatha
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదండోయ్ సుమలత. వీరిద్దరి కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు హిట్లు ఉన్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో వీరిద్దరిపై అప్పట్లో ఈ రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. అయితే వాటిపై సుమలత చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది.
ఏకంగా పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చింది. చిరంజీవి కూడా ఈ విషయం పై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యి ఈ వార్తలను ఖండించాడు. అప్పటి నుంచే వీరిద్దరూ కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ ఒక్క రూమర్ తప్ప చిరంజీవిపై ఎలాంటి రూమర్లు స్ప్రెడ్ కాలేవు.