Mega Star Chiranjeevi : గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి.. నటుడికి రూ.40 లక్షల సాయం..!

NQ Staff - March 16, 2023 / 11:35 AM IST

Mega Star Chiranjeevi : గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి.. నటుడికి రూ.40 లక్షల సాయం..!

Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎంత మంచి మనిషో అందరికీ బాగా తెలుసు. ఆయన కెరీర్ పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎవరి సపోర్టు లేకుండా ఇంత ఎత్తుకు ఎదగడం అంటే మాటలు కాదు. అయితే అంత గొప్ప స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో హార్డ్ వర్క్, పట్టువదలని శ్రమ అవసరం. ఇవన్నీ చిరంజీవిలో ఉన్నాయి కాబట్టే ఆయన అంత గొప్ప స్థాయికి ఎదిగారు.

కాగా చిరంజీవి కెరీర్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగారో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి మనసు చాటుకున్నారు. ఇప్పటికే ఆయన చారిటీ ట్రస్టుల ద్వారా ఎంతో మంది పేదలకు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. 1990వ దశకంలో స్టార్ విలన్ గా రాణించారు పొన్నంబలం.

చిరంజీవి ఫోన్ చేసి..

ఆయన తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఆయనకు రీసెంట్ గా కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. దాంతో ఆయన చిరంజీవిని సాయం చేయమని కోరారు. ఒక లక్షో లేదంటే రెండు లక్షలో ఇస్తారని భావించారు. కానీ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి నువ్వు హైదరాబాద్ కు వచ్చెయ్ అని చెప్పారు.

తాను రాలేనని పొన్నంబలం చెప్పడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లమని చెప్పారు. అక్కడ మొత్తం ట్రీట్ మెంట్ ఉచితంగా చేశారు. దానికి రూ.40లక్షలు ఖర్చు అయితే ఆ మొత్తాన్ని చిరంజీవి స్వయంగా భరించారు. ఈ విషయాలను పొన్నంబలం స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us