Mahesh Babu: మహేష్ అభిమానులకి ‘మెగా, పవర్’ ర్యాగింగ్.!

NQ Staff - June 13, 2022 / 10:00 PM IST

Mahesh Babu: మహేష్ అభిమానులకి ‘మెగా, పవర్’ ర్యాగింగ్.!

Mahesh Babu: ఓ వైపు పవర్ ర్యాగింగ్.. ఇంకో వైపు మెగా ర్యాగింగ్.. వెరసి సూపర్ స్టార్ అభిమానుల్లో కొందరికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ‘సర్కారు వారి పాట’ సినిమా గురించి పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్.. వీళ్ళెవరూ మాట్లాడలేదంటూ తెగ బాధపడిపోయారు మహేష్ అభిమానుల పేరుతో కొందరు దురభిమానులు.

Mega Power Ragging for Mahesh Babu Fans

Mega Power Ragging for Mahesh Babu Fans

మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినాగానీ, ఆ దురభిమానులు.. ఆయా సినిమాలపై విపరీతమైన నెగెటివిటీని ప్రచారం చేస్తూ వస్తున్నారు గత కొంతకాలంగా. కానీ, మెగా కాంపౌండ్ హీరోలకి ఏ ఇతర హీరోతోనూ విభేదాల్లేవ్. అందరితోనూ సఖ్యంగానే వుంటారు. ఇతర హీరోలు కూడా అంతే. నిజానికి, పరిశ్రమలో ఒకరిద్దరు మినహా, అందరూ అందరితోనూ బాగానే వుంటారు.

మేజర్‌కి మెగా ప్రశంసలు.!

నిన్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్, ‘మేజర్’ సినిమా టీమ్‌ని అభినందిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేస్తే, తాజాగా ‘మేజర్’ టీమ్‌తో ముచ్చటించారు మెగాస్టార్ చిరంజీవి. ‘మహేష్.. నిన్ను చూసి గర్వపడుతున్నా..’ అంటూ, ‘మేజర్’ సినిమా నిర్మాత అయిన మహేష్‌ని అభినందిస్తూ, హీరో అడివి శేష్ సహా, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి తమతో మాట్లాడటం, తమ సినిమా గురించి గొప్పగా చెప్పడం పట్ల ‘మేజర్’ టీమ్ ఉబ్బితబ్బిబ్బవుతోంది. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.. అంటున్నారు ‘మేజర్’ టీమ్ సభ్యులు.
పరిశ్రమలో హీరోలంతా ఇలా సఖ్యతగా వుండటం చూడలేని సోకాల్డ్ దురభిమానులకు ఈ కలయిక అస్సలు రుచించదనుకోండి.. అది వేరే సంగతి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us