Acharya: మీమ్స్‌తో ర‌చ్చ చేస్తున్న మెగా హీరోలు.. వ‌రుణ్ తేజ్ మీమ్‌కు నెటిజ‌న్స్ ఫ‌న్నీ రియాక్ష‌న్

Acharya సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగిన‌ప్ప‌టి నుండి మీమ్స్ బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చాయి. ఫన్నీ మీమ్స్‌తో నెటిజ‌న్స్ సామాజిక మాధ్యమాల‌లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంటారు.ముఖ్యంగా బ్ర‌హ్మానందం ఫొటోతో వ‌చ్చే మీమ్స్ మంచి వినోదాన్ని అందిస్తుంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి త‌న సినిమా ఆచార్య టీజ‌ర్ కోసం స‌రికొత్త మీమ్‌తో అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.కొర‌టాల‌తో సంభాష‌ణ‌కు సంబంధించి ఫ‌న్నీమీమ్ ట్వీట్ చేశాడు. ‘ఆచార్య’ టీజర్ న్యూ ఇయర్ కి ఇవ్వలేదు.. సంక్రాంతి కి లేదు.. ఇంకెప్పుడు?.. టీజర్ ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి నేను రెడీగా ఉన్నానంటూ చిరు ఫన్నీ మీమ్ పోస్ట్ చేశారు.

చిరు మీమ్‌కు స్పందించిన కొర‌టాల శివ ఈ రోజు ఉద‌యం 10 గంటట‌ల‌కు అప్‌డేట్ ఇస్తాన‌ని చెప్పి జ‌న‌వ‌రి 29 సాయంత్రం 4.05ని.ల‌కు ఆచార్య టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక తాజాగా వ‌రుణ్ తేజ్ కూడా ఫన్నీ మీమ్ షేర్ చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ‘చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా టీజర్ కి.. బయట టాక్’ అంటూ బ్రహ్మానందం ఇమేజ్ తో ఉన్న ఓ మీమ్ షేర్ చేసి ట్వీట్ చేసాడు. దీంతో్ మెగా హీరోలంద‌రు మీమ్‌ల‌తో ర‌చ్చ చేస్తున్నారంటూ నెటిజ‌న్స్ .. కామెంట్స్ పెడ‌తున్నారు. చిరంజీవి మీమ్‌తో పాటు వ‌రుణ్ తేజ్ షేర్ చేసిన మీమ్ కూడా ట్రెండింగ్‌గా మారింది.

ఇక్క‌డ మ‌రో విశేషం ఏమంటే నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు మెగాస్టార్ చిరంజీవి మ‌స‌లుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యప‌రుస్తుంది. సోష‌ల్ మీడియా అకౌంట్స్ ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌లు చేస్తూ ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న చిరు తాజాగా మీమ్స్ బాట ప‌ట్ట‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ప్ర‌స్తుతం ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్న చిరంజీవి త్వ‌ర‌లో లూసిఫ‌ర్, వేదాళం చిత్ర రీమేక్‌లు చేయ‌నున్నాడు. లూసిఫ‌ర్ చిత్రం మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా, వేదాళం చిత్రం మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ రెండు చిత్రాల త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను సినిమా చేయ‌నున్నారు చిరు.

Advertisement