chiranjeevi:చిరంజీవిని క‌ల‌వాల‌ని దివ్యాంగ అభిమాని 726 కిలోమీట‌ర్ల‌లు పాదయాత్ర చేశాడా..!

chiranjeevi: ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది అభిమానులు త‌మ అభిమాన స్టార్స్‌ని క‌లిసేందుకు పాద‌యాత్ర‌లు, సైకిల్ యాత్ర‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. సోనూసూద్ ఇంటికి నిత్యం అభిమానులు వ‌స్తూనే ఉంటార‌ట‌.ఆయ‌న వారిని క‌లుస్తూనే ఉంటార‌ట‌. ఇటీవ‌ల చిరంజీవిని క‌లిసేందుకు కూడా పాద‌యాత్ర‌లు, సైకి ల్ యాత్ర‌లు చేప‌డుతున్నారు.

TheNewsQube-
mega fan meets chiranjeevi (1)
mega fan meets chiranjeevi (1)

చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ కు మెగా కుటుంబమంటే ఎనలేని అభిమానం. ఆ ఫ్యామిలీ పెద్ద చిరంజీవితో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఈశ్వర్ వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని తిరుపతి వెంకటేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామిని కోరుకున్నాడు. వారు కరోనా నుండి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారడంతో ఆ దేవుళ్లకు మొక్కు తీర్చుకున్నాడు.

ఈశ్వర్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సైకిల్ పై బయలుదేరాడు. సుమారు 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి ఇవాళ సరిగ్గా చిరంజీవి పుట్టినరోజున కొండగట్టు కు చేరుకున్నాడు. ఆ త‌ర్వాత చిరు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసాడు.

ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్‌ చిరంజీవికి పెద్ద అభిమాని. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్‌ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేయాలనుకున్నాడు. అక్టోబర్ 3వ అమలాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించి, 23 రోజులు 726 కి. మీ నడిచి సోమవారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరకి చేరుకున్నాడు.

గంగాధర్‌ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు చిరు. అనంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. చిరంజీవిని క‌ల‌వ‌డంతో గంగాధ‌ర్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.