Ram Charan Upasana : బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
NQ Staff - June 20, 2023 / 07:44 AM IST

Ram Charan Upasana : మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సమయం వచ్చేసింది. మంగళవారం మెగా ఫ్యామిలీలో మూడవ తరం రాబోతుంది అంటూ స్వామినాయుడు ప్రకటించిన విషయం తెల్సిందే. అన్నట్లుగానే మంగళవారం తెల్లవారుజామునే ఉపాసన బిడ్డకు జన్మనిచ్చినట్లుగా అపోలో ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
చిరంజీవి మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి అమ్మాయికి తల్లిదండ్రులు అయ్యాయి. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లుగా అపోలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి మెగా ఫ్యామిలీ లో మరియు మెగా ఫ్యాన్స్ లో ఆనందం వెళ్లివిరుస్తోంది.
చిరంజీవి ఇద్దరు కుమార్తెలకు కూడా ఇద్దరు ఇద్దరు చొప్పున అమ్మాయిలు ఉన్నారు. ఈసారి ఉపాసన ద్వారా అబ్బాయికి చిరంజీవి తాత అవుతాడు.. కొణిదెల వారసత్వం నిలిపేందుకు అబ్బాయి వస్తాడని మెగా ఫ్యాన్స్ లో కొందరు ఎదురు చూశారు. అయితే పాప పుట్టినప్పటికి కూడా మెగా ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు.