chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అనేవి చాలా కామన్. మూవీ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి అది పూర్తయ్యే వరకు ప్రతి పని మొదలు పెట్టేటప్పుడు సెంటిమెంట్‌ని నమ్ముకుంటుంటారు. బాలయ్య లాంటి హీరోలు అయితే సెకన్స్ కూడా తేడా రాకుండి సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజ్‌లకు ముహూర్తాలకు పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు ముగ్గురు హీరోలు 13 సెంటిమెంట్‌ను ఫాలో అవుతుండడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఆ ముగ్గురు హీరోల సెంటిమెంట్ కహానీ ఏంటనేది ఇప్పుడు చూద్ధాం.
మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి,రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రస్తుతం తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కొరటాల.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 13న విడుదల కానుంది. ఇక రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కాల్పనిక కథ ఆధారంగా తెరకెక్కుతుండగా, ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించనున్నారు. మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుందంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఖమ్మంలోని మోతుగూడెం గ్రామంలో చిత్ర షూటింగ్ జరుపుకుంటుండగా, ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకా 170 రోజుల షూటింగ్ మిగిలి ఉన్నప్పటికీ ఆగస్ట్ 13న చిత్రం విడుదల చేయనున్నట్టు సుకుమార్ టీం గట్టిగానే చెప్పింది. అయితే ఈ ముగ్గురు హీరోలు సంఖ్యాబలం ప్రకారం తమ సినిమాల రిలీజ్ డేట్‌ను 13కు ఫిక్స్ చేశారా లేక యాధృచ్చికంగా జరిగిందో తెలియదు కాని వేరు వేరు నెలలలో 13న విడుదల అవుతున్న ఈ మూడు సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని అందరు కోరుకుంటున్నారు.