Raviteja : రవితేజ తో మెగా బ్యానర్ సినిమా..?

Raviteja : రవితేజ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. క్రాక్ సినిమాతో మూడేళ్ళ తర్వాత భారీ హిట్ అందుకున్న ఈ మాస్ మహారాజ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇప్పటికే డ్యూయల్ రోల్ లో ఖిలాడి చేస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతీ లాల్ గడ నిర్మిస్తున్నారు. హీరోయిన్స్‌గా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

mega banner movie with raviteja
mega banner movie with raviteja

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేలా చేశాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా బ్రేక్ వేసింది. కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఖిలాడి రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మరో సినిమాను చేస్తున్నాడు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతోంది. అలాగే త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు.

Raviteja : రాం చరణ్ సొంత నిర్మాణ సంస్థలో రవితేజ ..?

కాగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ సొంత నిర్మాణ సంస్థలో రవితేజ ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’. పృథ్వీరాజ్ – సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చరణ్ రైట్స్ కొన్నాడు. ఇందులో ఒక హీరోగా రవితేజ ను అనుకుంటున్నారట. మరొక హీరోగా ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. కాగా చరణ్ బ్యానర్ లో మీడియం బడ్జెట్ సినిమాలకి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.