VAKEEL SAAB: వకీల్ సాబ్ నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

మూడేళ్ల త‌ర్వాత శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ అనే చిత్రంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది. తొలి వారం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి జోష్ చూపించిన ఈ మూవీ క‌రోనా వ‌ల‌న నిరాశ‌ప‌రిచింది. ఇక చేసేదేం లేక ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. ఏప్రిల్ 30న వ‌కీల్ సాబ్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. అంతేకాదు మూవీ నుండి ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో సన్నివేశాలు ఆస‌క్తికరంగా ఉన్నాయి.

వ‌కీల్ సాబ్ చిత్రం సుమారు 90 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకోగా, నైజాంలో రూ.25.2 కోట్లు, సీడెడ్‌లో రూ.13.4 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.10.9 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రూ.7.1 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6.3 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.7.6 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.6.5 కోట్లు, నెల్లూరులో రూ.3.35 కోట్లు మేర బిజినెస్ జరిగింది.ఇక థియేట‌ర్‌లో రిలైజ‌న త‌ర్వాత ఓవ‌ర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల‌లో ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.85.87 కోట్ల షేర్ రాబట్టగా, మొత్తంగా రూ.137.20 కోట్లు వసూలు చేసింది. దాంతో స్వల్ప నష్టాల్లో ఈ సినిమా బాక్సాఫీష్ జర్ని ముగిసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 

Advertisement