VACCINE: దొంగ ఐడీ కార్డ్‌తో వ్యాక్సిన్ తీసుకున్న మీరా.. అడ్డంగా బుక్ అయిన ప‌వ‌న్ భామ‌

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు వ్యాక్సిన్ కోసం ఎగ‌బ‌డుతున్నారు. ఒక‌ప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండ‌ని ప్ర‌భుత్వాలు మొత్తుకున్న‌ప్ప‌టికీ, అటు వైపు ఎవ‌రు చూడ‌లేఉద‌. కాని ఇప్పుడు వ్యాక్సిన్ లోనూ బడాబాబులు రాజకీయ పైరవీలు చేయించి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ జనం రోజుల తరబడి వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చుంటుండగా, ప్ర‌ముఖులుగా చెప్పుకునే కొంద‌రు దొడ్డి దారిన వ్యాక్సిన్ పొందేవారు మాత్రం తమ పని తేలిగ్గా కానిచ్చేస్తున్నారు.

తెలుగులో పవన్ కల్యాణ్ సరసన ‘బంగారం’ చిత్రంలో న‌టించిన మీరా చోప్రా థానేలోని పార్కింగ్​ ప్లాజా వ్యాక్సినేషన్​ సెంటర్​ దగ్గర డోస్​ వేయించుకుంది. ఓం సాయి ఆరోగ్య కేర్​ ప్రైవేట్ లిమిటెడ్​లో ఆమె సూపర్​వైజర్​గా పని చేస్తున్నట్లుగా ఓ ఫేక్​ ఐడీ క్రియేట్ చేసి వ్యాక్సిన్ తీసుకుంద‌ట‌. ఈ వ్యవహారం బయటకు రావడంతో.. చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. థానే మునిసిపల్ కార్పొరేషన్ కూడా దీనిపై స్పందించింది. ఇలా చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని విచారణకు ఆదేశించామని కార్పొరేషన్ పీఆర్వో సందీప్ మాల్వీ చెప్పారు. ఈ ఆరోపణలు రుజువైతే క్రిమినల్ చర్యలు సైతం తీసుకుంటామని చెప్పారు. మీరా చోప్రా అలియాస్​ నీలా తమిళంతో పాటు తెలుగు, హింది సినిమాల్లో నటించింది